తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త కాన్వాయ్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే అత్యాధునిక కార్లతో ఉన్నకాన్వాయ్ ఆయనకు ఉంది. అయితే కొత్తగా మళ్లీ ఒక్కో కారు కొటిన్నర విలువ ఉండే ఐదు కార్ల కాన్వాయ్‌ను ఆయన సిద్ధం చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వ్యవహారాలు అన్నీ సీక్రెట్‌గా జరుగుతున్నాయి. ఈ కార్లు గురువారం విజయవాడకు వచ్చాయి. గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక కార్గో విమానంలో వచ్చిన కార్లు.. మల్లపల్లి పారిశ్రామికవాడలోని ఓ గ్యారేజ్‌కు వెళ్లాయి. అక్కడ కొన్ని ఫిట్టింగ్స్ చేసిన తర్వాత మళ్లీ ఆ కార్లను కార్గోలో తరలించారు.
అయితే వాటిని హైదరాబాద్ నుంచి తీసుకు రాలేదని.. అలాగే హైదరాబాద్ తీసుకెళ్లలేదని తెలుస్తోంది. వాటిని తయారీ సంస్థ తీసుకొచ్చి .. తుది మెరుగుల కోసం మళ్లీ తీసుకెళ్లి ఉంటుందని.. ఆ తయారీ సంస్థ ఢిల్లీలో ఉందని భావిస్తున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల కోసం ఈ కాన్వాయ్ సిద్దం చేస్తున్నారని ఢిల్లీలోనే ఉంచుతారని చెబుతున్నారు. కేసీఆర్ ఇప్పటికే రెండు, మూడు కాన్వాయ్‌లు మార్చారు. ఇప్పుడు మరొక కాన్వాయ్ గుట్టు చప్పుడు కాకుండా రెడీ చేయించడం ఆసక్తి రేపుతోంది.
ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. హైదరాబాద్‌లో వినియోగానికేనా..లేకపోతే ఉత్తరాది పర్యటనల కోసమా అన్నదానిపై ఆ వాహనాలు హ్యాండోవర్ చేసిన తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.