కొంతకాలంగా ఏదీ కలిసి రాని కేసీఆర్… ఇప్పుడు తన ఎర్రవల్లి ఫాంహౌజ్ లో మరో యాగం చేపట్టారు. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు, కీలకమైన పనులు మొదలుపెట్టే ముందు కేసీఆర్ కు యాగాలు చేయటం, పూజలు చేయటం అలవాటు.
ఈ నెల 11 నుండి కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లబోతున్నారు… కార్యాచరణ రెడీ అవుతుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, కేసీఆర్ నవగ్రహ యాగం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
జాతకరిత్యా ఏదీ కలిసి రానప్పుడు, శాంతి హోమాలు చేస్తుంటారు. కేసీఆర్ ప్రస్తుతం అలాంటి నవగ్రహ హోమం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా తరుచూ అనారోగ్యానికి గురికావటం, ఎన్నికల్లో ఓటమి తర్వాత కాలం కలిసిరావట్లేదన్న ఉద్దేశంతో కేసీఆర్ దంపతులు ఈ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అతికొద్ది మంది సమక్షంలో ఈ పూజలు నిర్వహిస్తున్నారు.
తొమ్మిది గ్రహాలకు తొమ్మిది రకాల పూలతో… వేదమంత్రోచ్ఛరణలతో ఈ పూజలు నిర్వహిస్తారు. తమకు ఉన్న దోశాలు పోవాలని, జాతకరిత్యా గ్రహబలం పెరగాలన్న ఉద్దేశంతో ఈ యాగం లేదా హోమం చేస్తారని పండితులంటున్నారు.
ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్ రాజశ్యామల యాగం నిర్వహించారు. కానీ ఎన్నికల్లో ఓటమి, అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కడో తప్పు జరిగిందన్న ఉద్దేశంతో మళ్లీ దోష నివారణ పూజలు కూడా చేశారు. తాజాగా ఇప్పుడు మరోసారి నవగ్రహ పూజలతో పాటు యాగాలు నిర్వహిస్తున్నారు.