తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్ చేసినా పదేళ్లు విద్యార్థుల సమస్యలపై ఎప్పుడూ స్పందించలేదు.కానీ, బీఆర్ఎస్ అధికారం కొల్పోయాక మొదటిసారి కేసీఆర్ ఓయూ సమస్యలపై పెదవి విరిచారు.
తెలంగాణలో విద్యుత్, తాగునీటికీ ఇబ్బంది ఉన్న మాట వాస్తవమేనని.. అందుకు ఓయూ చీఫ్ వార్డెన్ తాజాగా విడుదల చేసిన సర్క్యులరే ఉదాహరణ అని ట్విట్టర్ వేదికగా కేసీఆర్ స్పందించారు. ఓయూలో విద్యుత్, తాగునీటి ఇబ్బంది ఉందని ఈమేరకు నెల రోజులపాటు మే 1 నుంచి మే31 వరకు సెలవులు ఇస్తున్నట్లు వార్డెన్ ఇచ్చిన సర్క్యులర్ తోపాటు విద్యార్థినిలు ఆందోళన చేస్తోన్న వీడియోను పోస్ట్ చేస్తూ కేసీఆర్ ట్వీట్ చేశారు.
ఈ ఏడాది ఓయూకు సెలవుల ప్రకటన ఇప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. మార్చి మొదట్లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. సాధారణ హాలీడేస్ గా ప్రకటిస్తే విద్యార్థుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురు అవుతుందని అంచనా వేసే… తాగునీరు, విద్యుత్ ఇబ్బందులతో సెలవులు ఇస్తున్నట్లుగా సర్క్యులర్ విడుదల చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఒకే సమయంలో ఓయూలో పలు వసతి గృహాలలో తాగునీరు ఇబ్బంది నెలకొనడంపై విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉద్దేశపూర్వకంగానే పలు హాస్టల్స్ లో తాగునీరు విషయంలో కృతిమ కొరత సృష్టించారనే ఆరోపిస్తున్నారు.
నిజానికి గతేడాది కూడా సమ్మర్ లో ఓయూకు హాలీడేస్ ఇచ్చారు. ఎండలు విపరీతంగా ఉండటంతోనే సెలవులు ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు. ఈసారి మాత్రం విద్యుత్, తాగునీరు కొరత అంటూ సర్క్యులర్ విడుదల చేయడం ఓయూ సమస్యలపై కేసీఆర్ స్పందించేందుకు కారణం అయింది. అయితే , కేసీఆర్ స్పందనపై విద్యార్థులు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. పదేళ్ల తర్వాత ఇప్పుడు ఓయూ గుర్తుకు వచ్చిందా కేసీఆర్ అంటూ స్టూడెంట్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Telangana CM and Dy CM were misleading the people on power, irrigation and drinking water supply in the state for the past 4 months.
Notice of Osmania University Chief Warden confirms that all their claims were farce.
The truth is that there is power, drinking water and… pic.twitter.com/PU213BFiuN
— KCR (@KCRBRSPresident) April 29, 2024