సీఎం కేసీఆర్ గ్రేటర్ మినహా దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో సభలు పెట్టాలని డిసైడయ్యారు. ఇప్పటికే 30కిపైగా నియోజకవర్గ సభల్లో ప్రసంగించిన ఆయన ఇప్పుడు జోరు పెంచారు. రోజుకు నాలుగు సభలు చొప్పున ప్రసంగాలు చేయాలని నిర్ణయించారు. గతంలో లోని విధంగా పరుగులు పెడుతున్నారు ఇప్పటి వరకూ రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల పేరుతో బహిరంగ సభలు నిర్వహించిన కేసీఆర్ ఇక ముందు నాలుగు సభలు పెట్టనున్నారు.
రెండో షెడ్యూల్లో భాగంగా 54 నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. ఈ నెల 28వ తేదీన గజ్వేల్ నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభతో కేసీఆర్ ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో మొత్తం 95 నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటించినట్లు అవుతుందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ సీఎంగా పదేళ్లలో వెళ్లని నియోజకవర్గాలకూ వెళ్తున్నారు. ఈ సారి పోటీ గట్టిగా ఉందని.. హంగ్ వచ్చే పరిస్థితులు ఉన్నాయన్న ప్రచారం కారణం తన ప్రచారంపై కేసీఆర్ మరింత ఎక్కువ దృష్టి పెడుతున్నారు.
కేసీఆర్ ప్రతి ఎన్నికల సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎన్నికల ప్రచారం చేస్తారు. రోజుకు నాలుగు సభల్లో పాల్గొనడం అంటే సామాన్యమైన విషయం కాదు. అయినా కేసీఆర్ సులువుగానే పని కానిచ్చేస్తారు. ఈ సారి కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు, కవితలు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు .