తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. కోల్ కతా నడిబొడ్డున దీక్ష చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తిని కాలరాస్తోందని.. .. సీబీఐని ప్రయోగించి… రాష్ట్రంలో అస్థిరత రేపడానికి ప్రయత్నిస్తోందనేది ఆరోపణ. మమతా బెనర్జీకి.. బీజేపీయేతర మిత్రపక్షాల పార్టీలన్నీ.. సంఘిభావం ప్రకటించారు. పలువురు పార్టీ నేతలు కోల్ కతా వెళ్లి.. ఆమెకు ప్రత్యక్షంగా మద్దతు తెలియచేయబోతున్నారు. అయితే.. తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి మాత్రం ఇంత వరకూ ఎలాంటి ప్రకటనా రాలేదు. ఈ విషయాన్ని జాతీయ మీడియా కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తోంది. దీనికి కారణం.. కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమి ఫెడరల్ ప్రంట్ కోసం.. కేసీఆర్.. రెండు సార్లు మమతా బెనర్జీతో సమావేశం అయ్యారు. రెండు సార్లు కేసీఆర్ ను సాదరంగా ఆహ్వానించి చర్చలు జరిపారు మమతా బెనర్జీ.
అయితే.. ఇప్పుడు అదే ఫెడరల్ వ్యవస్థను.. మోదీ భ్రష్టుపట్టిస్తున్నారని.. దీదీ .. దీక్షకు దిగితే.. మాత్రం.. కేసీఆర్ స్పందించలేదు. అందుకే.. జాతీయ మీడియా … విపక్షాల కూటమి.. కేసీఆర్ చూలా దూరమని.. విశ్లేషిస్తూ కథనాలు ప్రచురిస్తోంది. గతంలో కోల్ కతా లో నిర్వహించిన విపక్ష పార్టీల ర్యాలీకి ..మమతా బెనర్జీ.. కేసీఆర్ కు స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే.. ఆ ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రతినిధులు కూడా హాజరు కావడంతో.. వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. కానీ ఇప్పుడు మమతా బెనర్జీ … ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఆమెకు.. ఇతర పార్టీల నేతలు మద్దతు పలుకుతున్నారు. వ్యక్తిగతంగా పరిచయం ఉన్న నేతలు కూడా… మద్దతు పలుకుతున్నారు. కానీ కేసీఆర్ స్పందించకపోవడం వల్లే విమర్శలు వస్తున్నాయి.
కేసీఆర్ మొదటి నుంచి బీజేపీ కోసమే ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు చేశారని… ఇప్పుడు మమతా బెనర్జీకి మాట మాత్రం కూడా మద్దతు ప్రకటించకపోవడమే దీనికి సాక్ష్యమని… కాంగ్రెస్ కొత్త ప్రచార కమిటీ చైర్మన్లు డీకే అరుణ, విజయశాంతి… విమర్శల దాడి ప్రారంభించేశారు కూడా..!