కెరీర్ బిగినింగ్ లో క్లాసిక్ విజయాలు దక్కడం కూడా చిక్కే. ఒక బెంచ్ మార్క్ సెట్ అయిపోతుంది. దాన్ని అందుకోవడం ప్రతిసారి సాధ్యం కాదు. కీర్తి సురేష్ కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైయింది. మహానటి క్లాసిక్ గా నిలిచింది. మహానటితో సావిత్రి పాత్రకు మళ్ళీ జీవం పోషించింది కీర్తి. ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ కూడా అందుకుంది.
కీర్తి అంటే ప్రేక్షకులకు ఒక అంచనా ఏర్పడిపోయింది. దీంతో ఆమె నుంచి వచ్చిన ప్రతి సినిమాని మహానటి స్థాయిలో చూశారు. దాన్ని అందుకోవడానికి చాలా లేడి ఓరియంటెడ్ సినిమాలు చేసింది. కానీ ఏదీ వర్క్ అవుట్ కాలేదు. ఇటు కమర్షియల్ పాత్రలు కూడా తేలిపోయాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న మహేష్ సర్కారు వారి పాట విజయం ఇవ్వకపొగా కళావతి పాత్ర విమర్శలకు గురి చేసింది.
అయితే ఎట్టకేలకు కీర్తి ‘దసరా’తో ఊపిరి పీల్చుకుంది. దసరాకి మంచి రివ్యూలు వచ్చాయి. కలెక్షన్స్ కూడా బావున్నాయి. వెన్నెల పాత్ర అందరికీ నచ్చింది. ఆ పాత్రలో కీర్తి నటనకు మంచి ప్రసంశలు దక్కాయి. మహానటి తర్వాత ఆమెకు చెప్పుకొదగ్గ విజయం ఇదే. తమిళ్ లో చేసిన సాని కాయిదం ఆమెకు మంచి పేరు తెచ్చింది కానీ కమర్షియల్ విజయాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు దసరా పేరుతో పాటు కమర్షియల్ సక్సెస్ వచ్చింది.