భారతీయ జనతా పార్టీకి ప్లస్ పాయింట్ విపక్షాలే. కాంగ్రెస్ పార్టీ సొంతంగా గెలిచే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇతర పార్టీలతో కలిసి మోడీని ఓడించాలి. కానీ ఆ ఇతర పార్టీల్లోని నేతలు తమను తాము కాంగ్రెస్ కంటే ఉన్నతంగా ఊహించుకుంటూ … అనైక్యతకు కారణం అవుతుతున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ అదే జరుగుతోంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. పీకే సలహాలతో కాంగ్రెస్ అంటే.. తృణమూల్ కాంగ్రెస్ అన్న అభిప్రాయాన్ని కల్పించేందుకు సిద్ధమైన మమతా బెనర్జీ.. కాంగ్రెస్ పార్టీని బలహీనం చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు..
ఓ ఈశాన్య రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలందర్నీ తృణమూల్ ఎమ్మెల్యేలుగా మార్చేశారు. ఇప్పుడు ఢిల్లీలో అసలు కాంగ్రెస్ ఎక్కడుంది..? యూపీఏ ఎక్కడుంది? అనే రాజకీయాలు చేస్తున్నారు. తాజాగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో కలిసి ఆమె ఇదే తరహా రాజకీయాలు చేస్తున్నారు. యూపీఏ లేదని… తామే ప్రత్యామ్నాయం అని అంటున్నారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రధాని పదవిపై ఆశలు పెట్టుకున్నారు. పంజాబ్‌లో గెలిస్తే తన పార్టీకి దేశవ్యాప్త క్రేజ్ వస్తుందని.. ఆయన నమ్ముతున్నారు.
ఇలా విపక్ష పార్టీలన్నీ ఎవరికి వారు తామే ప్రత్యామ్నాయం అనుకుంటూ ఉండటం.. బీజేపీ నెత్తిన పాలు పోస్తున్నట్లుగా అవుతోంది. ఈ పరిణామాల్ని బీజేపీ తనకు అనకూలంగా మల్చుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ అసలు లేదని.. తాము తప్ప.. ఎవరూ దేశాన్ని సమైక్యంగా ఉంచలేరన్న వాదనను తెరపైకి తెస్తున్నారు. బీజేపీని ఎదుర్కొనే విషయంలో విపక్షాలు ఇలా ఉంటే.. ఎంత ప్రజా వ్యతిరేకత ఉన్నా.. బీజేపీకి మూడో చాన్స్ దక్కడం ఖాయమే.