విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారశైలి ముక్కుసూటిగా ఉంటుంది. ఆయన చెప్పాలనుకున్నది నేరుగానే చెబుతారు. ఈ తీరు వల్లే మొదట్లో ఆయన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా వెక్కి తగ్గలేదు. ఇప్పుడు సర్దుకుపోయినా.. మరోసారి తన ట్వీట్‌తో.. టీడీపీ వారితో కూడా.. నిజమే కదా అనిపించేలా చేస్తున్నారు. ఆ ట్వీట్… ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌కు సంబంధించినది. ఓ దినపత్రిలో వచ్చిన వార్తను.. ట్వీట్ చేస్తూ… ” మీరు ముఖ్యమంత్రి అవ్వటానికి మీ పార్టీ అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ ఓడిపోవటానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిని సన్మానిస్తారనుకుంటే సస్పెండ్ చేశారేంటి జగన్మోహన్ రెడ్డి గారూ!!!” అంటూ ఆశ్చర్యం ప్రకటించారు.
నిజానికి ఇది కేశినేని నాని మనసులో మాట మాత్రమే కాదు.. దాదాపుగా.. టీడీపీలోని ఓ మాదిరి నేతలందరిలోనూ ఉన్న అభిప్రాయం అంటూ ఉంటారు. ఇంటలిజెన్స్ చీఫ్ గా .. ఏబీ వెంకటేశ్వరరావుకు చంద్రబాబు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆయన ఇచ్చే రిపోర్టులను బట్టే నిర్ణయాలు తీసుకునేవారని అంటారు. పార్టీ యంత్రాంగాన్ని కూడా ఆయన ఇచ్చే రిపోర్టులను బట్టే నడపడం వల్ల.. సామాన్యుల్లో పార్టీకి ఇబ్బంది అయిందని… చాలా మంది నమ్ముతూ ఉంటారు. అయితే.. ఈ విషయాన్ని చాలా మంది బయటకు చెప్పరు. కానీ.. కేశినేని నాని మాత్రం… ఈ విషయంలో మొహమాటలకు పోలేదు.
చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్న పార్టీ నేతల కన్నా… బ్యూరో క్రసీకే ప్రాధాన్యం ఇస్తారన్న అభిప్రాయం పార్టీ క్యాడర్లో ఉంది. పార్టీ నేతలు… ఎంత మంచి సలహాలు ఇచ్చినా.. చివరికి అధికారులు ఇచ్చిన వాటి వైపే మొగ్గు చూపుతారని చెబుతూంటారు. ఆ క్రమంలో కొంత మంది అధికారులు ఆయన చుట్టూ కోటరీగా ఏర్పడిపోతూంటారు. ఇంటలిజెన్స్ చీఫ్ గా.. పొలిటికల్ ఇంటలిజెన్స్ కూడా చూసే.. ఏబీవీ.. ఈ విషయంలో మరింతగా చంద్రబాబు అభిమానాన్ని చూరగొన్నారు. కానీ.. ఆయన రిపోర్టులన్నీ… తలకిందులయ్యాయి. అందుకే… ఆయన సస్పెన్షన్ టీడీపీ లో పెద్దగా.. రియాక్షన్ తెచ్చి పెట్టలేకపోయిందంటున్నారు.
https://twitter.com/kesineni_nani/status/1226387588933509120