తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని భయపడి ఫైల్స్ తగులబెట్టడం ప్రారంభించారు. అధికారంలోకి వచ్చిన నెల తర్వాత కూడా అదే పనిగా తగలబెడుతున్నారు. సీఐడీ ఆఫీసులో చంద్రబాబు కేసుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను కొల్లి రఘురామిరెడ్డి .. ఎన్నికల ఫలితాలకు ముందే తగులబెట్టించారు. అప్పట్నుంచి ప్రారంభమైన సీజన్.. ఇంకా కొనసాగుతోంది.
Also Read : పెద్దిరెడ్డి కోసమే…? మదనపల్లె ఇష్యూపై మంత్రి సంచలన వ్యాఖ్యలు
మైనింగ్ శాఖలో ఎన్నో ఫైళ్లు తగులబెట్టారు. ఉన్నత విద్యామండలిలో ఫైళ్లను ముక్కలు చేశారు. కరకట్ట మీద ఓ కారు నిండా ఫైల్స్ తీసుకొచ్చి నిప్పు పెట్టారు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. చాలా ఫైళ్లు మిస్సవుతుననాయని చెబుతున్నారు. ఇప్పుడు మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ తగలబడిపోయింది. ఎప్పుడూ లేనిది ఇప్పుడే జరుగుతున్నాయంటే… ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో చెప్పాల్సిన పని లేదు.
అసలు చేసిన నేరాల కన్నా… ఫైళ్లు తగలబెడితే.. వేసే శిక్షే తక్కువ అని డిసైడయిపోయి.. తగులబెట్టేస్తున్నారు. ఇందు కోసం వందిమాగధులైన అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి… ఎవరిపైనైనా సరే కఠిన చర్యలు తీసుకోకపోతే… మాత్రం… ఇక అక్రమాలకు అడ్డూ అదుపూఉండదు.