అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ ఎవరు తెచ్చారు..?. ఈ ప్రశ్నలకు తెలుగుదేశం పార్టీ నేతలు … మా చంద్రబాబు అని మరో మాట లేకుండా చెప్పుకుంటారు. అదే వైసీపీ వాళ్లయితే… నిన్నటి వరకు.. ఇంకా చెప్పాలంటే.. ఈ రోజు ఉదయం.. అసలు రహస్యాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బయట పెట్టనంత వరకూ… ప్రధాని మోడీ తెచ్చారని ప్రచారం చేస్తూ ఉంటారు., కానీ.. అసలు రహస్యాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బయట పెట్టేశారు. అసలు.. కియా మోటార్స్ తీసుకొచ్చింది.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయనే స్వయంగా ప్రయత్నాలు చేయడం వల్లే కియా మోటార్స్ వచ్చిందట. ఈ విషయాన్ని కియా మోటార్స్ ప్రతినిధులే.. ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలిపారట.
ఎన్నికల ప్రచారంలో.., జగన్మోహన్ రెడ్డి అనంతపురం వెళ్లారు. కియా పరిశ్రమ ఉన్న పెనుగొండకు కూడా వెళ్లారు. అక్కడ ఆయన … తన తండ్రి వైఎస్ వల్ల కియా పరిశ్రమ వచ్చిందని చెప్పలేదు. కానీ… ఆ క్రెడిట్‌ను తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు కాక… నరేంద్రమోడీకి ఇచ్చారు. నరేంద్రమోడీ వల్లే ఏపీకి కియా మోటార్స్ వచ్చిందని ప్రకటించారు. అంటే.. దాదాపుగా పదేళ్ల కిందట చనిపోయిన తన తండ్రిని క్రెడిట్ ఇవ్వడానికి ఆయనకు కూడా మనసొప్పలేదు. ఇప్పుడు మాత్రం.. అసెంబ్లీ సాక్షిగా… బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైఎస్‌కి క్రెడిట్ ఇచ్చేశారు.
కియా మోటార్స్‌కు ఏపీ నుంచి ప్రతిపాదనలు వెళ్లినప్పుడు.. వైఎస్ జీవించి ఉన్నారా.. లేదా … అన్నది తర్వాతి విషయం ముందుగా తమ పార్టీకి మూలపురుషుడైన.. వైఎస్‌కు..ఎక్కడ లేని క్రెడిట్ ఇవ్వడానికి.. వైసీపీ మంత్రి తాపత్రయపడిపోయారు. సొంత పార్టీ వాళ్లు నమ్మినా .. నమ్మకపోయినా.. అన్నింటిలాగే.. దాన్ని కూడా ప్రచారం చేసుకుంటారని.. భావించారేమో కానీ.., సామాన్యుల దృష్టిలో మాత్రం.. మరీ కామెడీ అయిపోతుంది. అంతగా వైఎస్ వల్ల కియా పరిశ్రమ వచ్చిందనుకుంటే.. ఆయన ప్రభుత్వ హయాంలో.. కనీసం.. ఓ ప్రతిపాదన లేఖ పంపినట్లుగా అయినా… ఓ పత్రాన్ని బుగ్గన విడుదల చేసి ఉండాల్సింది. కియా ప్రతినిధులే లేఖ రాశారంటూ.. కొత్తగా… ఆయన.. సాక్ష్యం తీసుకొచ్చుకున్నారు.
https://www.youtube.com/watch?v=Y1s_yuG_txM