దేశంలో న్యాయవ్యవస్థ ఎన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నదో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. కొలిజీయం వ్యవస్త ఎెంపిక చేస్తున్న న్యాయమూర్తులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అయితే ఇప్పుడు కేంద్రం.. అసలు కొలీజియం వ్యవస్థ వద్దని న్యాయమూర్తుల్ని కూడా తామే నియమిస్తామని పట్టుబడుతోంది. కొన్నాళ్లుగా కొలీజియం చేసే సిఫార్సుల్ని పట్టించుకోని కేంద్రం … తాజాగా అసలు ఆ కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధి ఉండాలని నేరుగా సీజేఐకిత లేఖ రాసింది.
న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో.. హైకోర్టు , సుప్రీంకోర్టు కొలీజియంలో మార్పుల ద్వారా న్యాయమూర్తుల నియామకాల రాజ్యాంగ ప్రక్రియలో ప్రభుత్వ ప్రతినిధులకు చోటు కల్పించాలని కిరణ్ రిజుజు సీజేఐకి సూచిస్తున్నారు. రిజుజు లెక్క ప్రకారం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియమకానికి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి.. రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల ఎంపికలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఉండాలన్నమాట. రాజకీయం ఇప్పటికే అన్ని వ్యవస్థలను శాసిస్తోంది. ఒక్క సారి అధికారం చేపడితే చాలు ఇక శాశ్వత అధికారం తమదేనన్నట్లుగా వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయవ్యవస్థనూ గుప్పిట పట్టే ఆలోచన రాజకీయం చేస్తోందని ఈ లేఖ ద్వారా సులువుగా అంచనా వేయవచ్నన్న అభిప్రాయం వినిపిస్తోంది.
న్యాయమూర్తుల నియామకాలపై కొలీజియం చేసిన సిఫార్సులను కేంద్రం పూర్తి స్థాయిలో ఆమోదించడం లేదు. డిసెంబర్ నాటికి హైకోర్టుల నుంచి వచ్చిన 154 ప్రతిపాదనలు ప్రభుత్వానికి, సుప్రీంకోర్టు కొలీజియంకు మధ్య వివిధ దశల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఖాళీలను త్వరగా భర్తీ చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, హైకోర్టుల్లో న్యాయమూర్తుల పదవీ విరమణ, రాజీనామా లేదా పదోన్నతి, న్యాయమూర్తుల సంఖ్య పెరగడం వల్ల న్యాయమూర్తుల ఖాళీలు తలెత్తుతూనే ఉన్నాయని కేంద్ర మంత్రి చెబుతున్నారు, కొలీజియం లో ప్రభుత్వ ప్రతినిధి ఉండాలన్నదానిపై ఇప్పుడు విస్తృత చర్చ జరిగే అవకాశం ఉంది.