టీడీపీ నేతలపై తనదైన శైలిలో విరుచుకుపడే ఆ వైసీపీ ఫైర్ బ్రాండ్ ఇప్పటికీ బయటకు రాకపోవడంపై రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఆయన ఎవరో కాదు.. కొడాలి నాని. పోలింగ్ ముగిసిన నాటి నుంచి ఆయన వైసీపీ గెలుస్తుందనో, టీడీపీ ఓడుతుందనో ఇప్పటి వరకు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వకపోవడంతో కొడాలి నానికి తత్త్వం బోధపడిందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆర్కే రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్ నాథ్ , అనిల్ కుమార్ యాదవ్ లు.. వీరిలో ఒక్కొక్కరు ఒక్కోలా వెన్నుపోటు పొడిచారని, రిగ్గింగ్ జరిగిందని, రీపోలింగ్ నిర్వహించాలని ఇలా ఎదో ఒక స్టేట్మెంట్ ఇచ్చినా కొడాలి నాని మాత్రం సైలెంట్ మోడ్ లో ఉండటం ఆసక్తికరంగా మారింది. వైసీపీ ఓడుతుందని అంచనాకు వచ్చే మౌనంగా ఉంటున్నారా..? లేక ఎన్నికల ఫలితాలు వచ్చాక తన పవర్ ఏంటో చూపించాలని ఫిక్స్ అయ్యారా..? అని ఏపీ పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
మరోసారి అధికారంలోకి వస్తామని జగన్ సైతం చెప్పినా కొడాలి నానికి నమ్మకం కుదరడం లేదా..? జగన్ ప్రకటన ఉత్తదే..?అని అందుకే కొడాలి నాని కాముష్ గా ఉన్నారా..? అని వైసీపీ శిబిరంలోనూ డిస్కషన్ కొనసాగుతోంది. అందరి అంచనాలు నిజమై కూటమి అధికారంలోకి వస్తే తన సహజశైలికి విరుద్దంగా కొడాలి నాని మౌనం వహిస్తారని అందుకు తాజా పరిణామాలే అద్దం పడుతున్నాయి అన్న టాక్ వినిపిస్తోంది.