కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్పై జల ఉద్యమం ప్రారంభించారు. నల్లగొండ రైతులకు నష్టం కలిగేలా ఆయన జీవో తెచ్చారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. నల్లగొండ రైతులందరితో కేసీఆర్ ప్రభుత్వంపై తిరుగుబాటుచేయిస్తానని చెబుతున్నారు. ఎస్ఎల్బీసీ ద్వారా నల్గొండ జిల్లాకు రావాల్సిన 45 టీఎంసీల నీటిని పాలమూరు-రంగారెడ్డికి కేటాయిస్తూ జీవో 246 తెచ్చారని కోమటిరెడ్డిఅంటున్నారు. ఎస్ఎల్బీసీకి కేటాయించిన నీటిని రద్దు చేసి జీవో విడుదల తెచ్చారన్నారు. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజల మధ్య సీఎం కేసీఆర్ గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.
ఈ జీవో అంశంపై కోమటిరెడ్డి గట్టి ఉద్యమ ప్రణాళికతోనే ఉన్నారు . 246 జీవోను రద్దు చేయకుంటే స్వయంగా దీక్షకు దిగుతానని ప్రకటించారు. 1980లో జరిగిన ఒప్పందం ప్రకారం నల్గొండ ప్రజలకు ఎస్ఎల్బీసీ ద్వారా 45 టీంఎసీలు కేటాయించారన్నారు. తెలంగాణ ఏర్పడి 8 ఏళ్లు అవుతున్నా నల్గొండ రైతులకు న్యాయం జరగడంలేదని ఆరోపించారు. కృష్ణా నది నుంచి ఏపీ ప్రభుత్వం నీటిని అక్రమంగా తరలిస్తుందని, అయినా తెలంగాణ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవడంలేదని అంటున్నారు.
రక్తపాతం జరుగుతుదంని కూడా కోమటిరెడ్డి హెచ్చరికలు జారీ చేయడం ఆయన చాలా క్లియర్ గా ఉన్నారన్న అభిప్రాయాలు కలిగిస్తోంది. ఉత్తర తెలంగాణలో ఉన్న ప్రాజెక్ట్ ల కాలువలు బాగున్నాయని, నల్గొండ జిల్లాలో కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. వాటిని బాగుచేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ఈ జీవో వివాదాలతో రక్తపాతం జరిగితే మీరే బాధ్యత వహించాలని కేసీఆర్కు కోమటిరెడ్డి హెచ్చరించారు. ఉద్యమం అంటూనే మరో వైపు జీవో రద్దుపై అవసరమైతే సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ తీసుకుని కలుస్తానని ప్రటించండ కొసమెరుపు !