సోషల్ మీడియాలో కొమ్మినేని మేకప్ తో ఉన్న ఫోటో, మేకప్ తో లేని ఫోటోలు కలిపి వైరల్ చేస్తూంటారు. సాక్షి వార్తను మేకప్ తో ఉన్న కొమ్మినేని ఫోటోను… ఆయన అసలు ఫోటోను నిజమైన వార్తగా చూపిస్తూ ఉంటారు. ఈ ట్రోల్స్ గురించి పక్కన పెడితే అంత కంటే ఎక్కువగా ఆయన తెలివి తేటలను బయట పెట్టుకున్న సందర్భం మరొకటి వెలుగు చూసింది. దాంతో ఆనయ తెలివి తేటల్ని చూసి జర్నలిస్ట్ సమాజం అబ్బురపడుతోంది. అసలు ఎలా ఇంత తెలివితేటలతో … ఎదిగారు సార్ అని అచ్చెరువొందుతున్నారు.
” అసలు ఆయన ఏమన్నారంటే.. వారాహి అమ్మవారు ఎక్కడి వారోతెలుసా . నేపాల్ లో కొలిచే ఏడుగురు దేవలలతో ఒకరు. అంటే తెలుగువారి దైవాలపై పవన్ కు నమ్మకం లేదన్నమాట” అన్నారు. పవన్ కల్యాణ్ ను విమర్శించడానికి ఆయన తన వాహనానికి పెట్టుకున్న వారాహి అనే పేరునుకూడా తప్పు పట్టాలని డిసైడైపోయి.. వారాహి అనే దేవత మన వారు కాదని.. పక్క దేశం వారని… తీర్పిచ్చేశారు కొమ్మినేని. ఆయన అన్న ఈ మాటలు విని..చేతుల్లో జేబులు పెట్టుకుని వెళ్లిపోయే వైసీపీ నేతలకూ లెక్క ఉండదు.
ఎందుకంటే దేవతల్ని కూడా మన దేవత. పరాయి దేవత అని చూడటం ఒకటి అయితే.. ఇతర దేశాలపై నమ్మకాలు పెట్టుకున్నారని ఆక్షేపించడం. చాలా మంది మరి జగన్ నమ్మే జీసస్ .. ఏ దేశం వాడనే ప్రశ్నలు ఆయనకు సహజంగానే వస్తున్నాయి. అవే కాదు..ఇంకా ఎక్కువగా వస్తున్నాయి. అసలు కొమ్మినేని ఇలా .. విషయం లేకుండా జర్నలిజం పేరుతో ఇంత కాలం ప్రజలకు అజ్ఞానాన్ని పంచాడా అన్న సందేహం సహజంగానే అందరికీ వస్తోంది.
పనిలో పనిగా.. వారాహి అనేది అమ్మవారికి ఉన్న అనేక నామాల్లో ఒక పేరు. బ్రాహ్మీ, మహేశ్వరీ, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. ఈ ఏడుగురు శక్తులను సప్తమాతృకలని అంటారు. భారతదేశంలోని దాదాపు అన్ని ప్రాచీన ఆలయాల్లో ఈ సప్త మాతృకల విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. యజ్ఞయాగాది క్రతువులలో వీరిని తప్పక అర్చిస్తారు. దేవుళ్లనూ రాజకీయం చేసే స్వయం ప్రకటిత జర్నలిస్టు మేధావికి.. తెలియకపోవడంలో విశేషం లేదు కానీ.. తెలియకపోతే తెలియనట్లు ఉండాలి కానీ.. ఇలా మాట్లాడటమేమిటన్నది ఆయనను మోస్తున్న వారికీ వచ్చే సందేహం.