ముద్రగడ పద్మనాభం కోనసీమ జిల్లా వివాదంపై స్పందించారు. ఆ వివాదాన్ని ముగించే ప్రయత్నం చేద్దామని కొంత మంది కాపు ప్రముఖులను ఉద్దేశించి లేఖ రాసిన ఆయన అందులో కొత్తగా అసలు న్యాయంగా అయితే కోనసీమ జిల్లాకు జీఎంసీ బాలయోగి పేరు పెట్టాల్సి ఉందన్నారు. బాలయోగి లోక్సభ స్పీకర్గా ఎన్నికయిన తర్వాతే కోనసీమలో అభివృద్ధి జరిగిందని .. ఆదే ఇప్పటికీ కొనసాగుతోందన్నారు. ఈ కారణంగా ఆయన పేరు పెట్టాల్సి ఉందన్నారు . కొన్ని కారణాల వల్ల పాలకులు పెట్టలేదన్నారు. ఆయన ఉద్దేశం బాలయోగి టీడీపీ నాయకుడని పెట్టలేదని చెప్పడం.
అయితే అంబేద్కర్ పేరు పెట్టడాన్ని ముద్రగడ వ్యతిరేకించలేదు. అందరూ స్వాగతించాలన్నారు. మంచి చేశాడని.. ఆనకట్ట కట్టారని కాటన్ దొర ఫోటోలను ఇంట్లో పెట్టుకుని పూజిస్తున్నామని వారి కుటుంబీకులు ఎవరైనా వచ్చినప్పుడు సన్మానిస్తున్నామని.. అలాంటిది మనకు స్వేచ్చా స్వాతంత్రాలతో కూడిన రాజ్యాంగాన్ని ఇచ్చిన అంబేద్కర్ను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన పేరు పెట్టినంత మాత్రాన జిల్లా ఒకరి సొంతమైపోదని ఆయనంటున్నారు.
ముద్రగడ కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి ఎప్పుడో మంగళం పాడారు. ఎప్పుడో ఓ లేఖ రాసేవారు . తర్వాత అది కూడా రాయడం మానేశారు. ఇప్పుడు ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందనుకున్నారో మరొకటో కానీ జిల్లాకు అంబేద్కర్ పేరు వివాదంపై కాపు నాయకుల్ని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు.