చిరంజీవి- రామ్ చరణ్- కొరటాల శివ మెగా సినిమా ‘ఆచార్య’ విడుదలకు సిద్దమైయింది. ఈ వారమే ప్రేక్షకులు ముందుకు వస్తుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. నిన్ననే ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ప్రస్తుతం యూనిట్ వరుసగా మీడియా ఇంటర్వ్యూలు ఇస్తుంది. అయితే ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ ఇంటర్వ్యూల్లో ఓ ప్రశ్నకు కొరటాల ఇబ్బంది పడుతున్నారు. మీడియా.. ఆచార్యని పక్కన పెట్టి ఎన్టీఆర్ తో కొరటాల చేయబోయే సినిమా గురించి అడుగుతున్నారు. కొరటాల ఆ సంగతి తర్వాత మాట్లాడదం అన్నా వినడం లేదు. ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలనే అడుగుతున్నారు. దీంతో కాస్త ఇబ్బంది పడుతున్నారు కొరటాల. ఒక సినిమా ప్రమోషన్స్ గురించి మాట్లడినప్పుడే ఆ సినిమా గురించే చెప్పాలి. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి సినిమా ప్రమోషన్స్ ఇంటర్వ్యూ లు సైడ్ ట్రాక్ పట్టడానికి లేదు. చిత్ర యూనిట్, పీఆర్వోలు ముందుగా వారిస్తున్నా.. మీడియా మాత్రం ఎన్టీఆర్ 30 సినిమా సంగతే చెప్పమని అడగడం ఒక్కింత ఆశ్చర్యకరంగానే వుంది. అయితే కొరటాల మాత్రం నవ్వి ఊరుకోవడం తప్పితే ఎన్టీఆర్ సినిమా గురించి ఒక్క క్లూ కూడా ఇవ్వడం లేదు.