‘హరిహర వీరమల్లు’ అర్థాంతరంగా ఆగిపోవడంతో క్రిష్ ఖాళీ అయిపోయాడు. ఈ యేడాది ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి, రాజకీయాలు చల్లబడినంత వరకూ పవన్ ఏ సినిమాకీ అందుబాటులో ఉండడు. అప్పటి వరకూ క్రిష్ ఏం చేయాలి? అందుకే మరో కథ రెడీ చేసుకొంటున్నాడు. పవన్ వచ్చేలోగా పూర్తయ్యిపోయేలా ఓ సినిమా చేయాలన్నది క్రిష్ ప్లాన్. యువ హీరోలంతా బిజీగా ఉన్నారు. స్టార్లు అందుబాటులో లేరు. అందుకే ఓ లేడీ ఓరియెంటెడ్ కథ సిద్ధం చేశాడు. ఈ కథకి అనుష్క అయితే న్యాయం చేస్తుందన్నది క్రిష్ నమ్మకం. అనుష్కతో క్రిష్‌కి మంచి రాపో ఉంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ‘వేదం’ అనుష్కకు మంచి పేరు తీసుకొచ్చింది.
అయితే అనుష్క ఇప్పుడు సినిమాల విషయంలో చాలా మొండిగా ఉంది. ఓ పట్టాన కథలు ఒప్పుకోవడం లేదు. పైగా సినిమాలపై ఆమెకు ఆసక్తి క్రమంగా తగ్గిపోతోంది కూడా. ఈ నేపథ్యంలో క్రిష్ సినిమాలో నటించడానికి మొగ్గు చూపిస్తుందా? అనేది అనుమానమే. అందుకే క్రిష్ రెండు, మూడు ఆప్షన్లను రెడీ చేసుకొన్నాడు. తన మొదటి ఎంపిక మాత్రం స్వీటీనే. ప్రస్తుతం స్క్రిప్టు రెడీ చేసే పనిలో ఉన్నాడు క్రిష్. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.