టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు మరో రెండు రోజుల్లో జరగనుంది. ఇరవై నాలుగోతేదీన ఆయన బర్త్ డే జరుపుకుంటున్నారు. దీంతో టీఆర్ఎస్ నేతల్లో హడావుడి కనిపిస్తోంది. ఆయనకు కొత్తగా యుగపురుషుడు అని టైటిల్ ఇచ్చి పొగడ్తల ప్రచారం ప్రారంభించారు. ముందుగా ఎంపీ రంజిత్ రెడ్డి ప్రత్యేకంగా వీడియో చేయించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో కేటీఆర్ గురించి ఆయన ప్రస్థానం గురించి వివరించారు. యువతకు ఆయన గొప్ప ఇనిస్పిరేషన్ అని చెప్పారు. దానికి కేటీఆర్ రిప్లై ఇచ్చారు. ధ్యాంక్స్ చెప్పారు.
ఆ వీడియోని టీఆర్ఎస్ నేతలు విస్తృతంగా షేర్ చేసుకుటున్నారు. ఈ సారి కేటీఆర్ బర్త్ డేకు ముందస్తుగా అంత హడావుడి కనిపించడం లేదు. గతంలో అయితే అంబులెన్స్‌లను విరాళంగా ఇవ్వడం.. వికలాంగులకు ద్విచక్ర వాహనాలు ఇవ్వడం వంటివి చేసేవారు. ఈ సారి వివిధ కారణాలతో సేవా కార్యక్రమాలు తగ్గిపోయాయి. అయితే ఈ సారి సోషల్ మీడియాలో కేటీఆర్ పుట్టిన రోజు మార్మోగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే టీఆర్ఎస్ సోషల్ మీడియా ఇటీవలి కాలంలో ట్రెండింగ్ లను ఓ అసైన్మెంట్గా పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తోంది.
కేసీఆర్ ముందుముందు జాతీయ రాజకీయాలకే పరిమితం కావాలనుకుంటున్నారు. ఇక నుంచి తెలంగాణలో కేటీఆర్‌దే ఆధిపత్యం ఉండనుంది.అందుకే .. పార్టీ నేతలు కూడా కేసీఆర్ కంటే.. కేటీఆర్‌కే ప్రాదాన్యం ఇస్తున్నారు. ఈ పుట్టినరోజుకు తమ టాలెంట్ అంతా చూపించి శుభాకాంక్షలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.