ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఎప్పుడొస్తుంది…? వచ్చే వారమే బెయిల్ వస్తుంది అంటున్నారు మాజీ మంత్రి, కవిత సోదరుడు కేటీఆర్.
అవును… వచ్చే వారమే కవితకు బెయిల్ వస్తుందని, ఇప్పటికే బెయిల్ ప్రాసెస్ నడుస్తోందన్నారు. కవిత జైల్లో 11కిలోల బరువు తగ్గారని, కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు తెలిపారు.
ఇప్పటికే ఇదే కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు ఈడీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చింది. తాజాగా కవితకు కూడా బెయిల్ వస్తుందంటూ కేటీఆర్ కామెంట్ చేయటం ఆసక్తికరంగా మారింది.
Also Read : సిసోడియాకు బెయిల్ .. కవిత బెయిల్ పై బీఆర్ఎస్ లో చిగురిస్తోన్న ఆశలు!
జైల్లో కవితకు బీపీ వచ్చింది… రోజుకు రెండు ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది, జైలు అపరిశుభ్రంగా ఉండటంతో పాటు 11వేల మంది ఖైదీలు ఉండాల్సిన ఆ జైల్లో ఏకంగా 30వేల మందిని ఉంచారని కేటీఆర్ చిట్ చాట్ లో తెలిపారు.
జైల్లో కవిత చాలా ఇబ్బంది పడుతున్నారు… కానీ జైలుకు వెళ్లి వచ్చిన వారు భవిష్యత్ లో పెద్ద లీడర్లు అయిన ప్రచారం కూడా ఉంది కదా అంటూ కామెంట్ చేయటం ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది.