పదేళ్లు మంత్రిగా పని చేసిన కేటీఆర్ కు అడ్మినిస్ట్రేషన్ పై ఏమాత్రం అవగాహన లేదని తెలిసిపోయింది. ఆయనే తన అవగాహనరాహిత్యాన్ని బయటపెట్టుకున్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల విషయంలో ప్రభుత్వం పై విమర్శలు చేయాలనే తొందరలో బేసిక్స్ తెలియకుండా మాట్లాడి ట్రోల్ అవుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ విడుదల చేయగానే ఈ అంశంపై తమ ఫైటింగ్ కు వేదికను అసెంబ్లీ నుంచి షిఫ్ట్ చేశారు బీఆర్ఎస్ నేతలు. జాబ్ క్యాలెండర్ ప్రకటించారు బాగానే ఉంది…అందులో పోస్టుల సంఖ్య పేర్కొనలేదని బయటకు వచ్చి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Also Read : గ్రామాల్లో మళ్లీ రెవెన్యూ సిస్టమ్.. రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం!?
జాబ్ క్యాలెండర్ ప్రకటించే ప్రభుత్వాలు ఆయా పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తాం అనేది మాత్రమే ప్రకటిస్తాయి. పోస్టుల సంఖ్యను ప్రకటించరు. కానీ, కేటీఆర్ మాత్రం పోస్టుల సంఖ్య ప్రకటించాలని డిమాండ్ చేయడం ఆయనకు జాబ్ క్యాలెండర్ పై ఏమాత్రం అవగాహన లేదని స్పష్టమైంది.
యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్లోనూ పోస్టుల సంఖ్య ఉండదు. ఆయా సమయంలో ఉండే ఖాళీలను గుర్తించి..షెడ్యూల్ చేసిన సమయానికి ఖాళీలు గుర్తించి ఖాళీలను భర్తీ చేస్తారు. ఇవేవీ తెలియకుండా కేటీఆర్ మాత్రం ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలనే తాపత్రయంలో అసలు విషయాన్ని మరిచి వ్యాఖ్యలు చెయడంతో ట్రోల్ కావాల్సి వచ్చింది.