భారతీయ జనతా పార్టీ జాతీయ వాదం పేరుతో రాజకీయాలు చేస్తుంది. తాము ఏం చేసినా దేశం కోసమేనని వాదిస్తూ ఉంటుంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా దేశం కోసం.. ధర్మం కోసం అన్నట్లుా మాట్లాడుతూ ఉంటారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిని దేశ వ్యతిరేక శక్తులుగా చూపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ వాదనకు కేటీఆర్ తనదైనశైలిలో కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తన వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు . అదే ” డెవలప్మెంటల్ నేషనలిజం” .
కుల, మత రాజకీయాల వల్లే వెనుకబడిపోయిన భారత్ !
భారత్ స్వాతంత్ర్యం సాధించుకుని ఏడు దశాబ్దాలు దాటిపోయినా ఇంకా అభివృద్ధి చెందిన దేశంగానే ఎందుకు ఉండిపోయింది? ఇప్పటికీ ప్రజలకు కనీస అవసరాలు ఎందుకు అందడం లేదు ? ప్రజల జీవన ప్రమాణాలు ఎందుకు పెరగడం లేదు ? వీటన్నింటినీ కేటీఆర్ ప్రత్యేకంగా చర్చకు తెస్తున్నారు. అదే సమయంలో మనతో పాటే పరుగు ప్రారంభించిన చైనా ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎలా అవతరించిందో కూడా వివరిస్తున్నారు. ఇటీవల చైనా ఎలా అభివృద్ధి సాధించిందో.. భారత్ ఎందుకు వెనుకబడిపోయిందో ఆయన ఇచ్చిన ఓ స్పీచ్ వైరల్ అయింది. కులాలు, మతాల పేరుతో కొట్లాటలు పెట్టే రాజకీయాల వల్లే దేశం వెనుకబడిపోయింది.
బీజేపీ జాతీయవాదానికి కేటీఆర్ విరుగుడు ప్రచారం !
ప్రస్తుతం బీజేపీ కూడా అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. హలాల్, హిజాబ్ పేరుతో మత రాజకీయాలకు పాల్పడుతోందని కేటీఆర్ ఆరోపణ. దానికి జాతీయవాదం ముసుగు తొడుగుతున్నారని ఆయన విమర్శిస్తున్నారు. అలాంటి రాజకీయాలకు ధీటుగా కేటీఆర్ “అభివృద్ధి జాతీయవాదాన్ని” ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. దేశ ప్రజల్లో విద్వేషం నింపడం జాతీయ వాదం కాదని.. ప్రజల బతుకుల్ని బాగు చేయడమే అసలైన జాతీయ వాదం అనే వాదనను ఆయన ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ” డెలవప్మెంటల్ నేషనలిజాన్ని” ప్రమోట్ చే్సతున్నారు.
ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తే దేశానికి ప్రయోజనమే !
దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అని మహానుభావులు ఎప్పుడో చెప్పారు. కానీ రాజకీయం మాత్రం దేశంలోని మనుషుల్ని దేశంలో భాగంగా గుర్తించడం లేదు. ఒకరిపై ఒకరు విద్వేషాలు పెంచడం ద్వారా ఒకర్ని శత్రువుగా.. మరొకర్ని సపోర్టర్‌గా మార్చుకుని రాజకీయం చేస్తున్నారు. ఈ క్రమంలో దేశాభివృద్ధి ఎవరికీ పట్టడం లేదు. సెగ తమకు తగిలే సరికి కావొచ్చు.. లేదా నిజంగానే రాజకీయాలు మార్చాలుకోవడం కావొచ్చు కేటీఆర్ సూచిస్తున్న డెలవప్మెంటల్ నషనలిజం మాత్రం దేశానికి.. అంటే ప్రజలకు చాలా మందిని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.