కొన్ని రోజులుగా చిట్ చాట్ వ్యాఖ్యలు రాజకీయంగా వేడెక్కిస్తూనే ఉన్నాయి. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీలో విలీనంపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా కేటీఆర్ కూడా చిట్ చాట్ నిర్వహించారు.
నాకున్న ఢిల్లీ నుండి ఉన్న పక్కా సమాచారం ప్రకారం… నేను కాషాయజెండా కప్పుకొనే ఏబీవీపీతో రాజకీయాల్లోకి వచ్చా. ఇదే కాషాయ జెండా కప్పుకొనే చనిపోతా అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీతో చెప్పారని కేటీఆర్ కామెంట్ చేశారు. మీకు ఎలా తెలిసిందని విలేకరులు అడగ్గా… నాకు పక్కా సమాచారం ఉంది, నేనూ గతంలో ప్రభుత్వంలో పనిచేశానంటూ కేటీఆర్ దాట వేశారు. మేము బీజేపీలో చేరటం కాదు సీఎం రేవంత్ రెడ్డే బీజేపీలో చేరుతారని, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు క్లారిటీ ఇవ్వాలంటూ కేటీఆర్ సూచించారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి… ప్రధాని మోడీతో సమావేశం అయ్యే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ గానే కేటీఆర్ ఈ కామెంట్స్ చేసినట్లుగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నా… సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది.
ఇక మహిళలపై తాను చేసిన కామెంట్లకు మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులు మెయిల్ ద్వారా అందినట్లు కేటీఆర్ దృవీకరిస్తూ, తాను విచారణకు హజరవుతానని కేటీఆర్ ప్రకటించారు. నేను క్షమాపణ చెప్పినా నన్ను విచారణకు పిలిచారు… రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలను కూడా మహిళా కమిషన్ కు ఇస్తానని కేటీఆర్ పేర్కొన్నారు.