బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనానికి రంగం సిద్ధమయిందని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తవగానే ప్రక్రియ పూర్తి చేస్తారని ఆర్టీవీ రవిప్రకాష్ పొలిటికల్ బ్లాస్టింగ్ న్యూస్ ప్రసారం చేశారు. తెలంగాణ రాజకీయవర్గాల్లో అదో సంచలనం అయింది. అత్యధిక మంది నమ్మడం ప్రారంభించారు. కేటీఆర్, హరీష్ ఢిల్లీలో పడిగాపులు పడుతూండటంతో .. డీల్ కోసమేనని అనుకుటున్నారు. అయితే స్పందించకపోతే బాగండదని అనుకున్నారేమో కానీ.. కేటీార్ ఓ ట్వీట్ చేశారు.
కాస్తంత సెంటిమెంట్.. కాస్తంత ఆగ్రహం కలిపి ఆ ట్వీట్ పెట్టారు. తాము తెలంగాణ కోసం కొట్లాడామని.. కొట్లాడుతూనే ఉంటామని.. కింద పడ్డా పైకి లేస్తామని చెప్పుకొచ్చారు. అంతర్గత అజెండాతో తమ పార్టీ విలీనం అని ప్రసారం చేస్తున్నారని.. దీనిపై వివరణ ఇవ్వకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఈ కేటీఆర్ ట్వీట్.. అటు గట్టిగా హెచ్చరించినట్లుగా కానీ ఇటు.. గట్టిగా ఆ ప్రచారాన్ని ఖండించినట్లుగా కూడా లేదన్న వాదన వినిపిస్తోంది.
Also Read : బీఎల్ సంతోష్ ఇక్కడ..కేటీఆర్ అక్కడ.. ఏం జరుగుతోంది!
అలాంటి ముచ్చటే లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి ఖండించవచ్చు కదా.. ఆయన ఒక్కరే ట్వీట్ చేశారుకానీ.. మిగతా పెద్ద నేతలు కనీసం స్పందించేందుకు ఆసక్తి చూపించలేదు. తెలంగాణ భవన్లో ప్రెస్మీట్లు పెట్టి అనేక విషయాలపై మాట్లాడుతున్నారు కానీ.. విలీనంపై మాట్లాడటం లేదు. కొసమెరుపేమిటంటే.. బీజేపీ నేతలు కూడా మాట్లాడటం లేదు. అంతర్గత చర్చలు జోరు మీద ఉన్నాయని.. డీల్ ఫైనల్ అవుతుందని బీఆర్ఎస్ వర్గాలు కూడా నమ్ముతున్నాయి. అందుకే కేటీఆర్ ట్వీట్‌ను అబ్బో పెద్ద హెచ్చరికే అని లైట్ తీసుకుంటున్నారు.