ఖుష్బూ…. ఓ ఫైర్ బ్రాండ్. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తుంది. లెక్కలేసుకొని మాట్లాడడం ఆమెకు చేతకాదు. అందుకే.. ఖుష్బూ వ్యాఖ్యలు ఎక్కువగా వివాదాస్పదనమవుతుంటాయి. తాజాగా టబు గురించి ఆ ఆసక్తికరమైన విషయం బయట పెట్టింది. ఓ రోజు టబుకి ఫోన్ చేసి చెడామడా తిట్టేసిందట. ఈ విషయాన్ని ఖుష్బూనే చెప్పింది.
”నాకు అమితాబ్ బచ్చన్ అంటే ప్రాణం. ఇప్పటికీ.. నా బెడ్ రూమ్ లో అమితాబ్ ఫొటోలు ఉంటాయి. ఆయనతో చిన్నప్పుడు నటించాను. పెద్దయ్యాక మాత్రం రొమాన్స్ చేసే అవకాశం రాలేదు. ‘చీనీకమ్’లో టబు – అమితాబ్‌లు కలిసి నటిస్తే ఎందుకు తట్టుకోలేకపోయాను. వెంటనే.. టబుకి ఫోన్ చేసి తిట్టేశాను. అమితాబ్ తో రొమాన్స్ చేస్తే నేను చేయాలి, నువ్వెందుకు చేశావ్… ఆ హక్కు – అర్హత నీకున్నాయా` అని అడిగేశాను.. అమితాబ్ అంటే నాకు అంత ఇష్టం” అంటూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లింది టబు. ”చిరంజీవితో ఒక్క సినిమా కూడా చేయలేదు. బాలయ్యతో కూడా నేను నటించలేదు. ఆ అవకాశం ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూస్తున్నా. తెలుగులో ఇప్పుడు మళ్లీ సినిమాలు చేస్తున్నా కదా.. త్వరలోనే ఆ ఛాన్స్ అందుకుంటానన్న నమ్మకం ఉంద”ని చెప్పుకొచ్చింది ఖుష్బూ. గోపీచంద్ `రామబాణం`లో ఖుష్బూ ఓ కీలక పాత్ర పోషించారు. మే 5న ఈ చిత్రం విడుదల కానుంది.
అజ్ఞాతవాసిలో ఖుష్బూ నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఈ ఫ్లాప్ పై ఖుష్బూ స్పందించింది. “ఆ సినిమా ఎందుకు వర్కవుట్ కాలేదో నాకు అర్థం కాలేదు. బహుశా.. నన్నూ, పవన్నీ తల్లీ కొడుకులుగా చూడలేకపోయారేమో. మా మధ్య మ్యాజిక్ మిస్ అయి ఉంఉటంది. అందుకే.. ఆ సినిమా ఆడలేదు“ అంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చింది.