వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆత్మీయులైన వారుఎవరూ ఇప్పుడు ఆయనకు దగ్గరగా లేరు. వైఎస్ ఆత్మగా పేరు తెచ్చుకున్న కేవీపీని జగన్ ఎప్పుడూ దగ్గరకు రానివ్వలేదు. కేవీపీ కూడా ఆ ప్రయత్నాలు చేయలేదు. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. వైఎస్ ఉన్నప్పుడు జగన్‌తో మంచి సంబంధాలు ఉన్నప్పటికీ కేవీపీ కూడా జగన్‌కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేయలేదు. కారణం ఏదైనా కేవీపీ మాత్రం కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు జగన్‌కు సలహాలిచ్చే ప్రయత్నం చేశారు కానీ వర్కవుట్ కాలేదు.
అయితే ఇటీవలి కాలంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుల్ని కఠినంగా శిక్షించాలని.. అంటున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ధ్వంసం చేశారని..పోలవరాన్ని మూలన పెట్టేశారని రాష్ట్ర ద్రోహం చేశారని అంటున్నారు. ఈ క్రమంలో ఆయన తాజాగా త్వరలో ఓ ప్రెస్ మీట్ పెడతానని ప్రకటించారు. ఆ ప్రెస్ మీట్ దేని కోసమంటే.. వైఎస్‌కు చాలా దగ్గరగా ఆత్మీయంగాఉన్న తాను జగన్‌కు ఎందుకు దగ్గర కాలేకపోయానన్నది చెప్పడానికట. నిజంగా కేవీపీ ప్రెస్ మీట్ పెడతాడో లేదో కానీ.. అది ఖచ్చితంగా జగన్ కు నెగెటివ్ గా ఉంటుందని వైసీపీనేతలు అప్పుడై డిసైడపోతున్నారు.
జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిలకు కూడా దూరంగా ఉన్నారు. ఇప్పుడుకేవీపీ కూడా వ్యతిరేకంగా మారినట్లే. నిజానికి జగన్ వీరందర్నీ ఎందుకు దూరం పెట్టారో వైసీపీ నేతలకూ అర్థం కాదు. హెలికాఫ్టర్ ప్రమాదంజరిగిన రోజు వైఎస్ తో పాటుసెక్యూరిటీ ఆఫీసర్లే వెళ్లారని ఎప్పుడూ వెంట ఉండే కేవీపీ, సూరీడులాంటివాళ్లు వెళ్లలేదని ఆయన అనుమానం పెట్టుకున్నారన్న గుసగుసలు ఉన్నాయి. అయితే కెవీపీ వైఎస్ వెంట జిల్లాల పర్యటనలకుఎప్పుడూ వెళ్లరని … హెలికాఫ్టర్‌లో ప్లేస్ లేక సూరీడు వెళ్లలేదని అప్పటి అంశాలపై అవగాహన ఉన్న వారు చెబుతూ ఉంటారు. కారణం ఏదైనా కేవీపీ తనను జగన్ ఎందుకు నమ్మడం లేదో బయటపెడితే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లవుతుంది.