పాటలు విపరీతంగా వున్నవారికి ఒక ట్యూన్ వినిపిస్తే.. అది ఫలాన కంపోజర్ చేసిన ట్యూన్ అని ఈజీగా చెప్పేస్తారు. మణిశర్మ లాంటి కంపోజర్ పాటలైతే ఇంకా సులువుగా పట్టేస్తారు. అయితే కొన్నిసార్లు తమ స్టయిల్ ని బ్రేక్ చేస్తూ కొన్ని పాటలు చేస్తుంటారు. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ నుంచి వచ్చిన క్యాలఫ్డా పాట విన్న తర్వాత అలానే అనిపించింది. పాట వినడానికి క్యాచిగా వుంది. కానీ ఆ ట్యూన్ చేసింది మణిశర్మేనా అనే ఓ చిన్న సందేహం. ఎందుకంటే మణి రెగ్యులర్ స్టయిల్ కాదది. కంపోజిషన్ ఐతే కొత్తగా వుంది.
ఇదొక రొమాంటిక్ నెంబర్.” నరం నరం గరం గరం.. పదింటికే చలి జ్వరం.. నీ వూహలే నిరంతరం.. పొతుందిరా నాలో శరం.. ఇలా సాగింది సాహిత్యం హర్ష రాసిన సాహిత్యం. ధనుంజయ, సింధుజా పాడిన తీరు కూడా హస్కీగా వుంది. పాటలో రామ్ కావ్య రొమాంటిక్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. మొత్తానికి ఇప్పటివరకూ డబుల్ ఇస్మార్ట్ నుంచి వచ్చిన పాటలకు భిన్నంగా సాగిందీ పాట.