ఆంధ్రప్రదేశ్‌లో అధికారులందరూ.. ఎన్నికల విధుల్లో ఉండగా… సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాత్రం.. హైదరాబాద్ వెళ్లి రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇస్తున్న ఉగాది ఆతిధ్యం స్వీకరిస్తూండగా.. అందులో ఆయనకు అంతా తీపే తగిలింది. అనిల్ చంద్ర పునేఠాను.. తొలగించేసిన ఈసీ.. కొత్తగా.. సుబ్రహ్మణ్యంని నియమించినట్లుగా అక్కడ ఉన్నప్పుడే సమాచారం అందింది. దాంతో.. గవర్నర్ ఆయనను.. హత్తుకుని శుభాకాంక్షలు చెప్పారు. అక్కడ ఉన్న ఇతరులు కూడా.. అదే చేశారు. కానీ.. ఏపీలో మాత్రం.. కాస్త తేడా ఫీడ్ బ్యాక్ బయటకు వచ్చింది. ఏం జరుగుతుందోనన్న ఆసక్తి ప్రారంభమయింది.
ఎందుకంటే.. ఎల్వీ సుబ్రాహ్మణ్యం.. సీబీఐ విచారణను ఎదుర్కొన్న అధికారి. జగన్ అక్రమాస్తులు, ఎమ్మార్ స్కాముల్లో ఆయనపై కేసు నమోదయింది. ఎమ్మార్ ప్రాపర్టీస్, ఏపీఐఐసి.. జాయింట్ వెంచర్‌గా..మణికొండలో ఈ కంపెనీ విల్లాలు, హోటళ్లు, క్లబ్‌హౌస్, గోల్ఫ్‌కోర్సు, టౌన్‌షి్‌పల నిర్మాణం చేపట్టారు. ఈ వెంచర్లో ఏపీ వాటాను వైఎస్ ప్రభుత్వం క్రమక్రమంగా తగ్గించేసి, ఎమ్మార్‌కు లబ్ధి చేకూర్చారు. ఈ వ్యవహారంలో లబ్ధి పొందిన వారంతా వైఎస్ కుమారుడు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. ఆ సమయంలో ఎల్వీ సుబ్రమణ్యం ఏపీఐఐసీగా ఉన్నారు. ఎమ్మార్ ఒప్పందాలను నీరుకార్చడంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలకపాత్ర వహించారని సీబీఐ తేల్చింది. విల్లాల ప్లాట్ల అమ్మకంలో రూ.1,347 కోట్లు, విల్లాల విక్రయంలో రూ. 1,256 కోట్లు, అపార్టుమెంట్ల విక్రయాల్లో రూ. 1,706 కోట్ల మేర ఏపీఐఐసీకి నష్టం వాటిల్లిందని సీబీఐ పేర్కొంది. జగన్ అక్రమాస్తుల కేసులో దాఖలు చేసిన చార్జిషీటులో ఎల్వీ పేరు ఉంది. కానీ కేంద్రం విచారణకు అనుమతి ఇవ్వలేదు. దాంతో ఎల్వీ బయటపడ్డారు. ఇప్పుడు ఏకంగా సీఎస్ అయిపోయారు.
దేశంలో ఎన్నో బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్నాయి. అత్యంత దారుణంగా.. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. గవర్నర్లు సైతం.. బీజేపీకి ఓటేయమని ప్రచారం చేసే పరిస్థితి ఏర్పడింది. అయినా.. ఈసీ .. బీజేపీ పాలిత రాష్ట్రాల వైపు కన్నెత్తి చూడటం లేదు. బీజేపీకి దగ్గరగా ఉండే పార్టీలు..అధికారంలో ఉన్న చోట కూడా.. ఈసీ ఎలాంటి ఫిర్యాదులకూ స్పందించడం లేదు. కానీ.. ఏపీ విషయంలో మాత్రం.. ఎలాంటి ఆరోపణలు ఉన్నాయో కూడా.. చెప్పకుండా.. కీలకమైన ఉన్నతాధికారులందర్నీ బదిలీ చేసేస్తున్నారు. ఆరోపణలు ఉన్న వారిని సీఎస్‌గా ప్రమోట్ చేస్తున్నారు. మరో వైపు కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి. అక్కడి సీఎం… ఈసీ తీరుతో కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అన్ని చోట్లా.. బీజేపీ.. ఆ పార్టీకి అనుబంధం.. స్నేహంగా ఉండేవారు మాత్రం… హాయిగా… వ్యవహారాలు చక్క బెట్టుకుంటున్నారు.