లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాతలు.. సినిమాలు ఆంధ్రప్రదేశ్లో విడుదల చేసుకునే ఉద్దేశంలో లేరు. ఇప్పటికే.. తెలంగాణ, ఓవర్సీస్లలో విడుదలైన సినిమాకు ధియేటర్ రెంట్లు ఎదురు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడటంతో.. ఏపీలో విడుదల చేసి.. కొత్తగా అదనపు ఖర్చు ఎందుకని అనుకుంటున్నారు. అందుకే వ్యూహాత్మకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఏపీలో చిత్రం విడుదలను నిలిపివేస్తూ … హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్లో అత్యవసరంగా విచారించాల్సి ఉందని.. నొక్కి చెప్పకపోవడంతో… సుప్రీంకోర్టు ఆ పిటిషన్ ను సైట్ తీసుకుంది. పిటిషన్పై సత్వర విచారణకు నిరాకరించింది. ఈ పిటిషన్ వచ్చే వారం తర్వాత విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాతే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనుంది.
హైకోర్టు ఇచ్చిన నిర్ణయం ప్రకారం.. మూడో తేదీన.. ఆ సినిమాను… హైకోర్టు చూడనుంది. ఆ తర్వాత విడుదలపై నిర్ణయం తీసుకుంటారు. అయితే.. మరో రెండు రోజుల్లోనే సినిమా చూడాల్సి ఉంది. ఈ లోపే… లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత.. రాకేష్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇప్పుడు హైకోర్టు.. సుప్రీంకోర్టులో… పిటిషన్ పరిష్కారం అయిన తర్వాతనే విచారించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే.. కనీసం ప్రతివాదులకు నోటీసులు ఇచ్చి.. వారి స్పందనకు తెలుసుకునేందుకు సమయం పడుతుందని.. న్యాయవాదికి బాగా తెలుసు. అయినప్పటికీ.. వారు కావాలనే…సినిమాను విడుదల చేయకూడదన్న ఉద్దేశంతోనే సుప్రీంకోర్టుకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.
ఏపీలో ఇప్పుడు ఆ సినిమా విడుదలైనా ఒకటే.. కాకపోయినా ఒకటే. ఎందుకంటే.. ఆ సినిమాను నిర్మాతలే పైరసీ చేసేసి.. ఆన్ లైన్ లో విడుదల చేశారు. ఇప్పుడు ఆ సినిమాను చూడాలనుకునేవారి… ఫోన్లలోనే అందుబాటులోకి వచ్చింది. ఇదంతా నిర్మాతలు ప్లాన్డ్ గా చేసిందే. కొత్తగా విడుదల చేస్తే ధియేటర్ రెంట్లు నష్టపోవడం తప్ప.. కొత్తగా వచ్చేదేమీ ఉండదని డిసైడైపోయి.. ఇలా సుప్రీంకోర్టు ద్వారా నిలుపుదల చేసుకుని.. ఆపేశారనే పేరు మాత్రం టీడీపీపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా భావిస్తున్నారు.