వాళ్లకు మూడెకరాలు ఉంది. కానీ ఆన్ లైన్ లో వేరే వారి పేరు మీదకు మారిపోయింది. ఎం చేయాలో తెలియక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు అడిగే వారు ఉండరు కాబట్టి… ఆ ఆన్ లైన్ లో పేరు మార్చుకున్న వారిదే ఆస్తి. ఇది అత్యంత హేయంగా అనిపించినా ఇది నిజం. సీఎం జగన్ సొంత జిల్లాలో జరిగింది.
కడప జిల్లాలో చేనేత కుటుంబం తమ ఆస్తిని ఆన్ లైన్ లో వేరే వారి పేరు మీద నమోదు కావడంతో షాక్ కు గురయ్యారు. అసలు అమ్మకాలు.. కొనుగోళ్లు.. రిజిస్ట్రేషన్లు ఏమీ లేకుండా ఇలా ఆస్తి పేరు మారిపోవడంతో.. తమకు ఉన్న ఒక్క ఆధారం పోయిందన్న బాధతో.. ఎవరి దగ్గరకు వెళ్లినా న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేకపోవడంతో చివరికి కుటుంబం ప్రాణం తీసుకుంది. ఆ కుటుంబం .. అప్పుల పాలై.. ఆస్తిని అమ్మకుందామని చూసుకుంది కాబట్టి… తెలిసింది. కానీ రాష్ట్రంలో కొన్ని లక్షల మందికి ఇలాంటి పరిస్థితి ఎదురుకానంది. ఆస్తుల ఆన్ లైన్ లో వేరే వారి పేరు మీదకు వెళ్లిపోయాయని ఎన్ని వేల ఫిర్యాదులు ఉన్నాయో లెక్కే లేదు.
వారి పొలం, ఇళ్లు వారి చేతిలోనే ఉంటాయి. కానీ ప్రభుత్వ రికార్డుల్లో మారిపోతున్నాయి. వివాదాలు సృష్టిస్తున్నారు. బెదిరించి ఆస్తులు కొట్టేస్తున్నారు. ఇటీవల ఒంగోలు ఇలాంటి భారీ మాఫియా వెలుగు చూసింది. కానీ పోలీసులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒక్క ఒంగోలు కాదు.. రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి. చూసుకోని వాడు ధన్యుడు సుమతీ అన్నట్లుగా మారిపోయింది. వైసీపీ నేతలు తమ అధికారంతో… ఆన్ లైన్ రికార్డులు ఎడాపెడా మార్చిపడేశారు. ఎవరి పేర్లు కావాలంటే వారి పేర్లు ఎక్కించారు.
మరోసారి వైసీపీ ప్రభుత్వం వస్తే ఇలాంటి వివాదాలకు అసలు అవకాశమే ఉండదు. ఎందుకంటే… ఆస్తి హక్కుదారులులేకుండానే రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి చేసుకుంటారు మరి .