మూడేళ్ల కిందట ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘనలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని హైకోర్టు న్యాయమూర్తి గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందనే అంశంలో రెండో అభిప్రాయం లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పింది. పౌరుల హక్కుల్ని హరించేలా ఏ రాష్ట్రం చట్టం చేయకూడదని రాజ్యాంగంలోని అధికరణ 13 స్పష్టం చేస్తోందని కానీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందన్నారు. దీనిపై హడావుడిగా సుప్రీంకోర్టుకు వెళ్లిన ఏపీ ప్రభుత్వం స్టే తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఆ న్యాయమూర్తి చెప్పిన రాజ్యాంగ ఉల్లంఘన ప్రతి ఒక్క అంశంలోనూ జరుగుతోంది. చట్టం, న్యాయం, రాజ్యాంగం అనేది ఏపీలో ఓ కామెడీ వస్తువు అయిపోయింది.
లా అండ్ ఆర్డర్ అంటే ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడమే
నిన్నటికి నిన్న చంద్రబాబు విడుదల సందర్భంగా స్వీట్లు పంచారని నెల్లూరులో కొంత మందిపై కేసులు పెట్టేశారు. గతంలో శాండ్ ఆర్ట్ వేశారని హత్యాయత్నం కేసులు పెట్టారు. ఇలాంటికేసుల లెక్క తీస్తే.. కొన్ని వేల కేసులు ఉంటాయి. ఇలాంటి కేసులు పెట్టమనా చట్టాలు చేసింది ? . దొంగతనాలు, హత్యలు, రేప్‌లు విచ్చలవిడిగా జరుగుతున్నా… నిందితులంతా కులాసాగా ఉన్నార. నేరస్తుల్లో ఎవరికీ భయం లేదు.. ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే… బ్యాంకులకు కత్తులతో వెళ్లి డబ్బులు దోచుకెళ్లిపోతున్నారు. పట్టపగలు ఇళ్లలోకి వచ్చి కత్తులతో పొడిచేస్తున్నారు. ఎవరూ దొరకరు.. దొరికినా వదిలి పెట్టేస్తారు. ఇంత ఘోరమైన లా అండ్ ఆర్డర్ ప్రపంచంలో మరే దేశంలోనూ ఉండదేమో ?
సాక్ష్యాలు ఏమీ అక్కర్లేదు.. ముందు శిక్షించడమే సీఐడీ పని
ఓ వైపు ప్రతిపక్ష నేతలపై ఇష్టారీతిన కేసులు పెట్టేస్తూంటారు. పోలీస్ స్టేషన్ వారీగా చూసుకున్నా… రాజకీయ కేసులే ఎక్కువ. టీడీపీ నేత అనే వ్యక్తి కాలు బయట పెడితే కేసు. ఇంకా ఎక్కువ టార్గెట్ చేసుకోవాలంటే.. రాజద్రోహం కేసులు కూడా పెట్టి అరెస్టు చేసి కొట్టేయడమే. ఈ కేసుల్లో సాక్ష్యాలుండవు… కానీ శిక్ష వేసేస్తారు. దాంతో ఇక తమ పని అయిపోయిందని చార్జిషీట్లు కూడా దాఖలు చేయరు., రాజ్యాంగం అంటే… ఇంత కామెడీ అయిపోయింది.
ప్రజాస్వామ్యానికి కొత్త అర్థం చెబుతున్న క్రిమినల్ పాలకుడు
న్యాయస్థానాలతోనూ ఓ ఆట ఆడుకుంటున్నారు. కేసులను రాత్రికి రాత్రి పెట్టేస్తారు. కానీ ఏదైనా విచారణకు వస్తే రెండు వారాలు, వారాలు విచారణ కావాలని అడుగుతూ ఉంటారు. రాజకీయ ప్రత్యర్థుల్ని అరెస్టు చేయడం … లోపల ఉంచి వారాల తరబడి వాయిదాలు కోరడం.. అంతకు మించి బయట ప్రెస్ మీట్లు పెట్టి తప్పుడు ప్రచారాలు చేయడం అంతా కామన్ అయిపోయింది. ఏపీలో ఎవరికీ హక్కులు లేవు. దొంగలకు.. హంతకులకు మాత్రమే రాజ్యాంగానికి అతీతంగా ప్రత్యేక హక్కులు ఉంటాయి. ఇంత ఘోరమైన రాజ్యాంగ ఉల్లంంఘన ఏపీలో జరుగుతున్నా.. వ్యవస్థలన్నీ కళ్లు మూసుకుని.. కేంద్రం సైతం చూసీ చూడనట్లుగా ఉండటం…. పతనమవుతున్న భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు సంకేతం.