లారెన్స్ కి తెలుగులో మంచి ఆదరణ వుంటుంది. ఆయనకి బ్రేక్ ఇచ్చింది తెలుగు సినిమానే. స్టైల్ సినిమాతో హీరోగా నిలబడ్డారు. మాస్, డాన్ చిత్రాలు దర్శకుడిగా మంచి పేరు తీసుకొచ్చాయి. అయితే రెబల్ డిజాస్టర్ తో ఇక్కడ ఆయన జోరు తగ్గింది. పైగా ఆయన క్రియేట్ చేసిన ‘కాంచన’ మంచి హిట్ ఫ్రాంచైజ్ గా మారింది. ఆ సిరిస్ లోనే సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు.
అయితే ఎట్టకేలకు ఆయన మరో తెలుగు సినిమా చేయడానికి మొగ్గుచూపిస్తున్నారు. శర్వానంద్ తో శ్రీకారం సినిమా తీసిన దర్శకుడు బి కిషోర్ ఇటివలే లారెన్స్ కి ఓ కథ చెప్పారు. ఈ కథ దాదాపు ఓకే అయ్యింది. హాస్య మూవీ బ్యానర్ పై రాజేష్ దండా ఈ సినిమాని నిర్మిస్తారని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.