ప్రియాతి ప్రియమైన సాక్షికి…
మీ పత్రికకు పాఠకుడు కాని తెలుగు రాష్ట్రాల్లో వ్యక్తి వ్రాస్తున్న లేఖ.
న్యూస్ పేపర్లు చదవడం అలవాటు లేదు కాబట్టి లేటుగా లక్ష్మీపార్వతిగారి ఇంటర్వ్యూ చదివా. లేట్ యన్ టి అర్ సంతానం యన్ టి అర్ హెల్త్ మీద దృష్టి పెడితే మరో పది యేళ్లు యన్ టి అర్ బ్రతికేవారని ఆవిడ చెప్పారు. రైటర్ కాబట్టి పెద్దాయనతో పరిచయాన్ని ప్రేమకథలా వల్లించారు. తెలుగుదేశం ప్రజల కళ్ళతో చూస్తే దురుద్దేశాలతో పెద్దాయన పక్కన చేరిన ఆడబిడ్డ లక్ష్మీపార్వతి. మహావృక్షానికి చుట్టుకున్న తీగలా, చెక్కలకు చేద పట్టినట్టు పెద్దాయనకు చీడలా పట్టిందంటారు. జీవితంలో ఎన్ని డక్కాముక్కీలు తిన్నాక ఆయన పంచన చేరిందో పాపం. అల్లుకుపోయింది.
పబ్లిగ్గా పెద్దాయన తాళి కట్టాడు కాబట్టి సెకండ్ వైఫ్ కింద ట్రీట్ చేద్దాం. ఫస్ట్ వైఫ్ పిల్లలు పురుగులా చూశారని మీ ఇంటర్వ్యూలో చెప్పింది. నందమూరి కుటుంబం నాకు అన్యాయం చేసిందని లక్ష్మీపార్వతి గగ్గోలు పెట్టడం కొత్త కాదని నిన్నటి పేపర్ ఈ రోజు చదువుతుంటే మా నాన్న చెప్పాడు. హిస్టరీలో వీక్ కాబట్టి యన్టీయార్, లక్ష్మీపార్వతి కథ తెలియదు. ఇంటర్వ్యూ చదివాక కొంత తెలిసింది. తెలిసిందానికంటే ఎక్కువ సందేహాలు కలిగాయి. ఎవర్ని అడగాలో తెలియక ఈ లేఖ వ్రాస్తున్నా.
బయోగ్రఫీ వ్రాయడానికి వచ్చిన ఆడబిడ్డను యన్టీయార్ ప్రేమించారని లక్ష్మీపార్వతి చెప్పినట్టు వ్రాశారు. దేవుడిలా ఆరాధించే వ్యక్తి పెళ్ళి చేసుకుంటావా అనడిగితే ఆడబిడ్డ ఒప్పేసుకుంది. అప్పటికి ఆవిడకు ఓ పిల్లాడు వున్నాడు. మీ ఇంటర్వ్యూలో వ్రాసినదే. పిల్లాడు వుంటే భర్త కూడా వుండాలిగా.
ఆ భర్త ఏమయ్యాడు…? యన్టీయార్ మనసులో స్థానం దొరికిందని, అప్పటివరకూ ఆవిడ మనసులో వున్న భర్తను బయటకు తోసిందా…? హోటల్ రూమ్ లో అద్దెకు దిగిన టూరిస్టును బయటకు గెంతినట్టు గెంతేసిందా…?
మా వివాహానికి కుటుంబ అంగీకారమే కాదు, సమాజ ఆమోదం కూడా వుందని వ్రాశారు. పెళ్ళికి ముందు, తరవాత అభిప్రాయ సేకరణ చేశారా…? సర్వేలు చేపట్టారా…? జరిగినది ఏదో జరిగినదని వదిలిస్తే అవాకులు చెవాకులు పేలడం ఎందుకు…?
ఏంటమ్మా…. యన్టీయార్ కి బ్రెయిన్ లో క్లాట్ ఏర్పడి, పేరాలసిస్ వచ్చిందని పెద్దాయన ఇంట్లో అందరికీ తెలిసినా ఎవరూ ఆయన ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టలేదా…? ఈవిడ ఏం చేసినట్టు…?
పెద్దాయన్ని కాపాడుకోవాలనే ఆలోచన లేదెవ్వరికీ, క్షోభకు గురి చేయకుండా బతకనిచ్చి ఉంటే ఆయన్ని మరో పదేళ్లు కాపాడుకునేదాన్ని అని లక్ష్మీపార్వతి ముసలి కన్నీటిబొట్లు రాల్చినట్టుంది. ఈవిడ క్షోభకు గురి చేయలేదా…? పెత్తనం చెలాయించాలని అర్రులు చాచలేదా…?
యుట్యూబ్ లో చూశా.. నా యెనక వున్న ఎమ్మల్యేలను చంద్రబాబు లాక్కున్నాడని నిన్నేదో ఇంటర్వ్యూలో చెప్పింది. పెద్దాయన పోయాడనే బాధ లేకుండా ఎమ్మెల్యేలతో రాజకీయం చేయాలనుకోవడాన్ని ఏమనుకోవాలి?
ఆఫ్ట్రాల్ కాలేజీ లెక్చరర్ ఈ రోజు ఇంత ఐశ్వర్యం అనుభవిస్తుందంటే కారణం ఎవరు…? పెద్దాయన్ని పెళ్ళి చేసుకోవడానికి మునుపే కన్నబిడ్డ డాక్టర్ అయ్యాడంటే కారణం ఎవరు…? అప్పట్లో డాక్టర్ చదువుకి ఎంత ఖర్చయ్యేది…? అదెవరు పెట్టుకున్నారు…?
పెద్దాయనకు సంస్కృతం రాదని, సంస్కృతం వచ్చిన నన్ను భాగస్వామిని చేసుకుని ఆ లోటును పరిపూర్ణం చేసుకున్నారని లక్ష్మీపార్వతి నోటికొచ్చినది చెప్తే ఎలా వ్రాశారు…? అతికి కూడా ఓ అంతు వుండొద్దూ…? సంస్కృతం రాకపోవడం ఒక లోటా…? అది వచ్చిన ఆడబిడ్డను పెళ్ళి చేసుకోవడం పరిపూర్ణమా…?
నాకొచ్చిన సందేహాలను, ప్రశ్నలు వ్రాస్తే ఈమెయిల్ నిండేట్టుంది. నాన్నను ఆడుదామనుకున్నా. నీకెందుకురా ఈ రాజకీయాలు అంటాడని వూరుకున్నా. వుండబట్టలేక నా వైఫ్‌ని అడిగా. పిచ్చోడ్డా అన్నట్టు ఒక చూపు చూసి, తెలుగుదేశానికి మీకు వున్న వైరం వివరించింది. లక్ష్మీస్ యన్టీయార్ ట్రయిలర్ ఫ్యామిలీ వార్త అన్నట్టు వ్రాశారట మీరు. ఛాన్స్ దొరికితే నందమూరి కుటుంబం, చంద్రబాబుపై మీరు బురద జల్లుతారని వైఫ్ లెక్చర్ ఇచ్చిన కాసేపటికి నాకో క్లారిటీ వచ్చింది.
జగన్ మంచోడని చెప్తే ఆయనకు నలుగురి వోట్లు పడతాయి కాని, నందమూరి కుటుంబాన్ని నలుగురిలో బదనాం చేస్తే పడతాయా ఏంటీ…? చెప్పి చెప్పి మీ నోళ్లు నొప్పి పుట్టడం తప్ప. ఈ లాజిక్ ఎలా మరచిపోతున్నారు…? నందమూరి కుటుంబంపై బురద జల్లే పనుల్లో మీ చేతులకు బాగా అంటింది. కడుక్కోండి.