హైదరాబాద్: ఇప్పటివరకు పట్టణ ప్రాంతాలలో ఫోన్ చేస్తే పిజ్జాలు, బిర్యానీలు డోర్ డెలివరీ ఇచ్చే కంపెనీలను చూశాం. అయితే మారుమూల గ్రామంలోకూడా ఇప్పుడు ఫోన్ ద్వారా గానీ, ఎస్ఎమ్ఎస్ ద్వారా గానీ మద్యం ఆర్డర్ చేస్తే డోర్ డెలివరీ ఇచ్చే ప్రత్యేక సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎక్సైజ్ అధికారులు కల్పించారు. బెల్టు షాపుల వ్యవస్థను తొలగించినందున ఈ ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
కొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా ప్రభుత్వంకూడా కొన్ని మద్యం దుకాణాలను ప్రారంభించింది. ఈ దుకాణాలలో ఎమ్ఆర్పీ ధరలకే మద్యాన్ని అమ్ముతున్నారు. ప్రభుత్వంనుంచి పోటీ ఎదురవటంతో ఎమ్ఆర్పీ కన్నా ఎక్కువ ధరకు అమ్మే ప్రైవేటు వైన్ షాపులవారుకూడా ఇప్పుడు ఎమ్ఆర్పీకి అమ్మక తప్పటంలేదు. మొత్తానికి ఏపీలో మందుబాబుల పని ఇప్పుడు మూడు పెగ్గులు, ఆరు బీర్లుగా ఉందన్నమాట.