పొరుగు రాష్ట్రాల్లో ఉండిపోయి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలనుకునే ఆంధ్రులకు ఇప్పటి వరకూ ఉన్న కష్టాలు తీరిపోనున్నాయి. రేపటి నుంచి కేంద్రం ఇచ్చిన లాక్ డౌన్ 5.0 రూల్స్ అమల్లోకి రానుండటంతో.. అంతర్రాష్ట్ర సరిహద్దులు ఎత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకూ ఏపీ సర్కార్… స్పందన యాప్‌లో పేర్లను నమోదు చేసుకున్నవారికే పాసులు జారీ చేస్తోంది. రేపట్నుంచి అలాంటి అవసరం లేదు ఇక నుంచి నేరుగా.. వెళ్లిపోవచ్చు. తెలంగాణ-ఏపీ బోర్డర్ చెక్‌పోస్టు ఎత్తివేయనున్నారు. అదే సమయంలో.. ఆర్టీసీకి ఆదాయం పెంచేందుకు..ఏపీ సర్కార్..తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను నడపాలని ప్రయత్నిస్తున్నారు. సోమవారం రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కానీ రాష్ట్రాలకే అంతిమ నిర్ణయం వదిలేసింది.
ఇప్పటికే ఏపీ నుంచి బస్సుల రాకపోకలపై ఒడిశా, తమిళనాడు.. కర్నాటక, తెలంగాణ ప్రభుత్వాలకు ఏపీ సీఎస్ నీలం సాహ్ని లేఖ రాశారు. కానీసీఎస్ లేఖలపై ఇప్పటివరకూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదు. ప్రభుత్వాలు అనుమతి ఇస్తే బస్సులు ఇతర రాష్ట్రాలకు వెళ్లివస్తాయి. ముఖ్యంగా హైదరబాద్ నుంచి బస్సు సర్వీసుల కోసం పెద్ద ఎత్తున జనం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సొంత వాహనం ఉన్న వారు మాత్రమే అటూ ఇటూ వెళ్లగలుగుతున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అందుబాటులోకి రాలేదు.చాలా కొద్ది రైళ్లు మాత్రమే నడుపుతున్నారు.
ఈ క్రమంలో… తెలంగాణ సర్కార్ అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతి ఇస్తే.. ఏపీ వాసులు పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. బోర్డర్ వద్ద చెక్ పోస్ట్ ఎత్తేస్తే.. ఓ పెద్ద సమస్య తీరిపోయినట్లు అవుతుంది వివిధ రకాలపనులపై ఏపీకి వెళ్లాలనుకునేవారికి. రాత్రికి రాత్రి ఏపీ సర్కార్ మనసు మార్చుకోకపోతే.. ఎలాంటి క్వారంటైన్ భయాలు లేకుండా అటూ ఇటూ తిరగడానికి అవకాశం ఉంటుంది.