తప్పుడు కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడ్ని అరెస్ట్ చేశారని.. ఆయన అరెస్టుపై తెలుగు ప్రజలంతా నిరసన వ్యక్తం చేశారని నారా లోకేష్ అన్నారు . రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. బంద్ కు మద్దతు ప్రకటించిన వారికి.. విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ తల పెట్టిన బంద్ కు సహకరించిన ప్రజలకు…పవన్ కళ్యాణ్ అన్న కు … మంద కృష్ణ మాదిగ కు.. కమ్యూనిష్టు లకూ కృతజ్ఞతలన్నారు. జగన్ చేసిన అతి పెద్ద తప్పు చంద్రబాబు అరెస్ట్ అన్నారు. ఈ తప్పునకు పర్యవసానాల్ని జగన్ రాజకీయంగా, వ్యక్తిగతంగా అనుభవిస్తారని లోకేష్ జోస్యం చెప్పారు.
పాముకు తలలో విషం..జగన్ కు వళ్లంతా విషం ఉంటుందన్నారు. జగన్ కు అధికారం అంటే ఏమిటో తెలియదు … అధికారం అంటే ప్రజలకు మేలు చెయ్యడం. ఉద్యోగాలు తేవడం…అభివృద్ధి చెయ్యడమన్నారు. కానీ జగన్ దృష్టిలో అధికారం అంటే వేధింపులు…కక్ష తీర్చుకోవడం మాత్రమేనన్నారు. జగన్ పై 38 కేసులు ఉన్నాయి.. బాబాయ్ హత్య కేసు…పింక్ డైమండ్ కేసు. . కోడి కత్తి కేసుల్లో ఎంత నిజముందో. చంద్రబాబు పై పెట్టిన కేసులో కూడా అంతే నిజముందమన్నారు. ఈ కేసు వల్ల జగన్ ఎంత సైకో నో ప్రజలకు రుజువైందని.. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కు ఆమోదం తెలిపిన వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం లో సలహా దారులు గా ఉన్నారు. వారిని ఎందుకు అరెస్ట్ చెయ్యలేదో జగన్ చెప్పాలన్నారు.
ఇన్నాళ్లూ ఈ కేసులో ఛార్జ్ షీట్ ఫైల్ కాలేదు అంటే ఒకటే అర్థం..ఈ అంశంలో తప్పు జరగలేదన్నారు. ” స్కిల్ డెవలప్మెంట్ ఇష్యూ వల్ల చంద్రబాబుకు డబ్బులు ముట్టాయని అధారాలతో నిరూపించే దమ్ము ఉందా?” అని ప్రశ్నించారు. CID అనేది కక్ష సాధింపు డిపార్ట్ మెంట్ గా మారిపోయింది. తనపై 20కి పైగా కేసులు పెట్టారు.హత్యాయత్నం కేసు కూడా పెట్టారు. నేను భయపడను..జగన్ ను వదిలిపెట్టనని స్పష్టం చేశారు. సొంత బాబాయ్ ను చంపిన అవినాష్ బయట దర్జాగా తిరుగుతున్నాడని.. లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తాం..ఇప్పుడు చూసింది ట్రైలర్ మాత్రమే అసలు పిక్చర్ ముందు ఉంది అని వైసీపీ నేతలు అంటున్నారు.నేను రాజమండ్రి లోనే ఉన్నాను బ్రదర్.. ఏం చేస్తారో చేసుకోండి .నేను సిద్ధంగానే ఉన్నానని చాలెంజ్ చేశారు.
ఈ కేసు వెనక ఎవరున్నారో తనకు తెలియదన్నారు లోకేష్. కేంద్రానికి తెలియ కుండానే ఈ అరెస్ట్ జరింగిందో ఏమో నాకు తెలియదు…బీజేపీ మిత్రులే దీనికి సమాధానం చెప్పాలన్నారు. నేను అన్నగా భావించే పవన్ కళ్యాణ్…మమతా బెనర్జీ లాంటి వాళ్ళు. . ప్రజలూ ఈ కష్ట సమయం లో మాకు స్వచ్ఛందంగా అండగా నిలబడ్డారు..నేనెలా ఒంటరి వాడిని అవుతానని లోకేష్ పఱశ్నించారు.
సొంత ఎంపీని కొట్టారు…తల్లిని ..చెల్లిని తరిమేశాడు ..ఇలాంటి వ్యక్తి చేతిలోని ప్రభుత్వం ప్రశ్నించేవారు ఎవరినైనా ఇబ్బందులు పెడతారన్నారు.