రివ్యూలపై వేడి వేడి చర్చ జరుగుతూనే ఉంది. మొన్నటికి మొన్న డీజే సమయంలో అల్లు అర్జున్, హరీష్ శంకర్ కంబైన్డ్‌గా రివ్యూలు రాసేవాళ్లపై రెచ్చిపోయారు. నిన్న ఎన్టీఆర్ అయితే… ‘దారిన పోయే దానయ్యలు’ అనేశాడు. సినిమాని చంపేస్తున్నారని వాపోయాడు. ఇప్పుడు మహేష్ వంతు వచ్చింది. అయితే మహేష్ రివ్యూలపై పాజిటీవ్‌గా స్పందించి ఝలక్ ఇచ్చాడు. స్పైడర్‌కి సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్లో రివ్యూలకు సంబంధించిన ప్రశ్న వచ్చింది. దానిపై మహేష్ స్పందిస్తూ.. ”రివ్యూలను నేనూ ఫాలో అవుతుంటా. సినిమా బాగుంటే బాగుందని చెప్తారు. బాగలేకపోతే బాలేదని చెబుతారు” అంటూ సింపుల్‌గా తేల్చేశాడు. ఎన్టీఆర్ రివ్యూలపై గరమ్ అయి 24 గంటలు గడవక ముందే… మహేష్ ఈ రీతిలో స్పందించడం, రివ్యూలను వెనకేసుకురావడం నిజంగా ఆలోచించదగిన విషయమే. ఒక రకంగా ఎన్టీఆర్ కామెంట్లని కార్నర్ చేసినట్టు అనుకోవొచ్చని సినీ విశ్లేషకులు, రివ్యూవర్లు ఇప్పటికే కామెంట్లు చేసేస్తున్నారు.
తన అభిమానుల విషయంలో కూడా మహేష్ పాజిటీవ్‌గా స్పందించడం విశేషం. ”నా అభిమానులు చాలా మంచివాళ్లు. వాళ్లు నిజాయతీగా వ్యవహరిస్తారు. ఇలాంటి అభిమానులు దొరకడం నా అదృష్టం” అన్నాడు మహేష్. ఇటీవల ఓ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ అభిమానుల గురించి ప్రస్తావించాడు. ”వాళ్లకు సినిమా నచ్చకపోతే.. మిగిలిన వాళ్లు బయటకు వెళ్లిపోండి.. మా హీరో సినిమా మీకు నచ్చదు. మేమే చూసుకొంటాం” అన్న సందర్భాలున్నాయి. అంత మంచి వాళ్లు నా అభిమానులు అంటూ పొంగిపోతున్నాడు.