సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమా విడుదల డేట్ మీద వార్తలు వచ్చాయి. ఏప్రియల్ 25న సినిమా విడుదల కాదని, కాస్త వారం వెనక్కు వెళ్తుందని వార్తలు వినిపించాయి. అసలు ఈ వార్తలు రావడానికి కారణాలు రెండు. ఒకటి శాసనసభ ఎన్నికలు ఆంధ్రలో ఏప్రియల్ 30న జరుగుతాయని వార్తలు వున్నాయి. కీలక ప్రచార సమయంలో మహర్షి విడుదల కావాల్సి వుంటుంది. రెండవది మహర్షి వర్క్.
ఎన్నికల టైమ్ లో సినిమా విడుదల పెద్ద ఇబ్బంది కాదు అనుకుంటే మహర్షి డేట్ మార్చాల్సిన పని లేదు. కానీ వర్క్ వరకు చూసుకంటే మాత్రం అవసరం అయితే మార్చాలి. వినిపిస్తున్న సమచారం ప్రకారం మార్చి 25నాటికి టాకీ మొత్తం అయిపోతుందని తెలుస్తోంది. అక్కడ రెండు మూడు పాటలు మాత్రం బకాయి వుంటాయి. వాటి షూట్ ఏప్రియల్ 1 నుంచి వుంటుంది. అంటే ఏప్రియల్ పది లోపు టోటల్ వర్క్ అయిపోతుంది.
ఇక మిగిలింది పోస్ట్ ప్రొడక్షన్. పాటలు పూర్తయిన తరువాత పది రోజులు టైమ్ వుంటుంది. ఆ సంగతి అలా వుంచితే, డబ్బింగ్, ఎడిటింగ్, రీరికార్డింగ్ వంటివి సమాంతరంగానడుస్తుంటాయి. అందువల్ల మిగిలిన పనులకు, డీటీఎస మిక్సింగ్, తదితర వ్యవహారాలకు ఆ పది రోజులు సరిపోతాయి అనుకుంటే ముందుకు వెళ్తారు. ఎటొచ్చీ కాస్త పని వత్తిడి వుంటుంది.
మహేష్ ఎలాగైనా 25కే అని అంటే వంశీ పైడిపల్లి కాస్త చకచకా పని చేయాల్సి వుంటుంది. లేదూ వాయిదా అంటే కాస్త నెమ్మదిగా పని చేస్తే సరిపోతుంది. నిర్మాత దిల్ రాజు ఒపీనియన్ అయతే జస్ట్ వారం వెనక్కు వెళ్దామని అంటున్నట్లు తెలుస్తోంది.