హైదరాబాద్: ఔట్లుక్ మ్యాగజైన్‌పై మంచులక్ష్మి మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న స్మితా సభర్వాల్‌పై ఆ పత్రిక వెలువరించిన కథనం చవకబారుగా ఉందని అన్నారు. అందమైన అమ్మాయి ఉన్నతస్థాయి పదవి నిర్వహించకూడదా అని ప్రశ్నించారు. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. ఔట్లుక్ మ్యాగజైన్ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. ఈ కథనాన్ని ప్రచురించినందుకు ఆ పత్రికపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈమేరకు లక్ష్మి ఒక వీడియోను విడుదల చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పనిచేస్తున్న స్మితా సభర్వాల్‌పై ఔట్ లుక్ మ్యాగజైన్ ఒక వివాదాస్పద కథనాన్ని వెలువరించిన సంగతి తెలిసిందే.