ఈమధ్య బాగా బొద్దుగా మారి, కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్న హీరోలు ఇద్దరే ఇద్దరు. ఒకరు నారా రోహిత్, మరొకరు మంచు మనోజ్. రోహిత్ ముందు నాజూగ్గానే ఉండేవాడు. సోలో సినిమాతో బాగా లావయ్యాడు. సినిమా సినిమాకి అది పెరుగుతోంది తప్ప.. తగ్గడం లేదు. మనోజ్ పరిస్థితి కూడా అంతే. మధ్య మధ్యలో సినిమాల గురించి తగ్గడం తప్ప… తను ఎప్పుడూ బొద్దుగానే ఉంటాడు. అయితే ఈమధ్య మరీ లావుగా మారాడు. శౌర్య సినిమాలో అది స్పష్టంగా కనిపించింది. అయితే.. ఇప్పుడు సన్నబడడం పై దృష్టి పెట్టాడట మనోజ్.
తన కొత్త సినిమా ఒక్కడు మిగిలాడు కోసం 12 కిలోలు తగ్గాడట. ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు మనోజ్. ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ పాత్ర ఒకటి, స్టూడెంట్ క్యారెక్టర్ మరోటి. లావుగా ఉన్నప్పుడు ప్రభాకర్ పాత్ర చేశాడట. 12 కిలోలు సన్నబడి స్టూడెంట్‌లా కనిపించాడట. పనిలో పనిగా ఇంకాస్త బరువు తగ్గాలని ధ్యేయంగా పెట్టుకొన్నాడట. మనోజ్‌కి ఈమధ్య సరైన విజయాల్లేవు. కరెంటు తీగ తరవాత.. సందడి లేదు. ముందు ఫిజిక్‌పై దృష్టి పెడితే.. ఆటోమెటిగ్గా కన్ఫిడెన్స్ పెరుగుతుందని ఇలా ఫిక్సయ్యాడేమో. ఒక్కడు మిగిలాడు.. రిజల్ట్ ఏమో గానీ, ఈ సినిమా కోసమైనా బరువు తగ్గాడు. అదే చాలు. ఇక రోహిత్ వంతు మిగిలింది. ఆయనెప్పుడు సిసలైన `హీరో` లుక్‌లో కనిపిస్తాడో మరి.