శరణార్థుల కథలన్నీ కన్నీటి గాథలే. ఒక దేశం నుంచి మరో దేశానికి వలస వెళ్లి, అక్కడ గడపలేక.. తిరిగి స్వదేశం రాలేక చివరికి తాము ఏ దేశానికి చెందుతామో లేల్చుకోలేక.. బిక్కు బిక్కుమంటూ జీవితాన్ని వెళ్లదీస్తున్నవాళ్లెందరో. శ్రీలంకలో ఎల్టీటీఈ సమస్య తీవ్రమవ్వడానికి, అక్కడ ఉద్యమాలు విధ్వంసాలు చెలరేగడానికి ఇదీ ఓ కారణమైంది. అలాంటి ఉద్యమాల్లోంచే ప్రభాకరన్లాంటి నాయకుడు పుట్టుకొచ్చాడు. ఆ కథే… ‘ఒక్కడు మిగిలాడు’లో చెప్పబోతున్నారు.
అజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మనోజ్ కథానాయకుడిగా నటించాడు. ఈనెల 10న విడుదల అవుతోంది. మెల్లమెల్లగా ప్రమోషన్లకు శ్రీకారం చుట్టింది చిత్రబృందం. ఇప్పుడో ట్రైలర్‌ని విడుదల చేసింది. ”మాకు దేశమే లేదా సార్” అనే ఒక్క డైలాగ్ చాలు. ఈ సినిమా కథ ఎలాంటిదో, నేపథ్యం ఏమిటో తెలియడానికి. గుండెల్ని పిండేసే ఆర్.ఆర్ తోడవ్వడంతో.. చిన్న ట్రైలర్లోనే కొండంత ఎమోషన్ కనిపించింది. సీరియెస్ పాయింట్ చుట్టూ నడిచే కథ ఇదని అర్థమవుతూనే ఉంది. మరి అది ఎంత వరకూ ఎక్కుతుందో చూడాలి.