మంచు ఫ్యామిలీ హీరోల రేంజ్ ఏమిటో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ట్రోలర్స్ కి ఈజీ టార్గెట్ అయిపోయారు. పైగా వాళ్లు చేసిన సినిమాలు కూడా అదే రేంజ్లో ఉంటున్నాయి. మాట్లాడే మాటలూ అంతే. `కన్నప్ప` సినిమాకి వంద కోట్లు పెట్టుబడి పెడతాం అన్నప్పుడు కూడా… జనాలు ఇలానే నవ్వుకొన్నారు. మంచు విష్ణుపై వంద కోట్ల సినిమానా, ఇదేదో జోక్ లా ఉందే అనుకొన్నారు. వాస్తవానికి విష్ణు రేంజ్ రూ.20 కోట్ల లోపే. అది కాబట్టడం కూడా కష్టం. అలాంటిది వంద కోట్లంటే ఎంత పెద్ద రిస్కో. పైగా.. మోసగాళ్లు అనే ఓ సినిమా తీసి, మాది రూ.50 కోట్ల భారీ బడ్జెట్ సినిమా అని చెప్పుకొన్నారు. దాంతో మరింత కామెడీ అయిపోయింది.
అయితే కన్నప్ప విషయాన్ని మాత్రం మంచు కుటుంబం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. ఈ ప్రాజెక్టులోకి ప్రభాస్ ని తీసుకురావడం కన్నప్ప సాధించిన తొలి విజయం. ఆ తరవాత నయనతార. అక్కడ్నుంచి స్టార్సంతా వస్తునే వున్నారు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్… ఇలా రోజుకో కొత్త పేరు వినిపిస్తోంది. టెక్నీషియన్ల విషయంలోనూ కన్నప్ప స్ట్రాంగ్ గా ఉంది. ఇలాగైతే.. వంద కోట్లేం ఖర్మ.. 150 కోట్లయినా పెట్టుబడి అవుతుంది. ఎన్ని ట్రోల్స్ వచ్చినా.. మెల్లమెల్లగా ఈ సినిమాపై అటు జనంలోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ ఎంతో కొంత చర్చ వచ్చేలా జాగ్రత్త పడుతోంది కన్నప్ప టీమ్. ఇదే ఉత్సాహం చివరి వరకూ ఉండాలి. ప్రమోషన్ల పరంగానూ స్ట్రాటజీ ఒకటి ఫాలో అవ్వాలి. పాన్ ఇండియా ఇమేజ్ ఈ సినిమాపై తీసుకురావాలి. ఇవన్నీ చేయగలిగితే… కన్నప్ప బజ్ విడుదల తేదీ వరకూ కొనసాగితే.. తప్పకుండా మంచు కుటుంబం అనుకొన్న లక్ష్యాన్ని చేరుకొంటుంది. ట్రోలర్స్ కి ధీటైన సమాధానం ఇవ్వగలుగుతుంది.