మలయాళంలో రాజుకొన్న హేమా కమిటీ సెగ.. ఇప్పుడు యావత్ చిత్రసీమనీ కుదుపేస్తోంది. చిత్రసీమలలో మహిళలు ఎదర్కొంటున్న సమస్యలు, వాళ్లపై చేస్తున్న లైంగిక దాడులు, శ్రమ దోపిడి గురించి ఈ కమిటీ విస్కృతమైన సమాచారం సేకరించి, ప్రభుత్వం ముందు ఉంచింది. అప్పటి నుంచీ… మలయాళ చిత్రసీమలో అలజడి ప్రారంభమైంది. ఎప్పుడైతే హేమా కమిటీ నివేదిక బయటకు వచ్చిందో, అప్పుడే ప్రకంపనలు మొదలయ్యాయి. చిత్రసీమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఒకొక్కరుగా గళం విప్పుతున్నారు. ‘మాక్కూడా ఇలాంటి కమిటీ ఒకటి కావాలి’ అంటూ మిగిలిన చిత్ర సీమల నుంచి గట్టిగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు టాలీవుడ్లోనూ అలాంటి చర్చ మొదలైంది.
As President of MAA, I have formally requested the Hon’ble Chief Minister, Deputy CM, and Cinematography Minister of Telangana to establish a commission aimed at enhancing the safety and representation of women in the Telugu Film Industry. Ensuring a secure environment for all,…
— Vishnu Manchu (@iVishnuManchu) September 5, 2024
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అధ్యక్షుడు మంచు విష్ణు కూడా ఈ మేరకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను సోషల్ మీడియా ద్వారా టాలీవుడ్ కి కూడా ఇలాంటి కమిటీ ఒకటి అవసరం ఉందంటూ, ఆ మేరకు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులూ, డిప్యూటీ సీఎంలూ చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగు చిత్రసీమలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొల్పడానికీ, ముఖ్యంగా మహిళలకు రక్షణ కల్పించడానికి ‘మా’ తన వంతుగా అన్ని రకాల సహాయ సహకారాల్ని అందిస్తుందని, చిత్రసీమ పెద్దల నుంచి సూచనలు కూడా తీసుకొంటుందని విష్ణు పేర్కొన్నారు. మహిళల పట్ల వివక్షత, శ్రమ దోపిడీ, లైంగిక వేధింపులు ఎక్కడైనా ఒకేలా ఉన్నాయి. తవ్వే కొద్దీ.. ఎన్నో దీన గాథలు. కానీ ధైర్యంగా చెప్పేవాళ్లు ఉన్నారా? నిర్భయంగా తమ సమస్యలు చెప్పుకొనేంత స్వేచ్ఛ తెలుగు చిత్రసీమలో దొరుకుతుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కాకపోతే.. ప్రభుత్వం ఈ విషయంలో కాస్త సీరియస్గా ఆలోచించాలి. బాధితులకు ‘మేమున్నాం’ అంటూ అండగా నిలబడితే, పోరాడడానికి వాళ్లకంటూ ఓ దైర్యం వస్తుంది.