మన్నెం నాగేశ్వరరావు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ.. ఇటీవల సీబీఐ డైరక్టర్‌గా కొత్త కాలం ఉన్న మన్నెం నాగశ్వరరావు అంటే చాలా మందికి ఓ ఐడియా వచ్చేస్తుంది. ఓ తెలుగు ఐపీఎస్ ఆఫీసర్ సీబీఐ డైరక్టర్‌గా ఎదిగారని అందరూ అనుకున్నారు కానీ..ఆయన తీరు వివాదాస్పదమయింది. ఆయన పదవి విరమణ చేశారు. అయితే.. అలా చేసే ముందు ఆయన… తరవాత పదవి కోసమో.. పోస్టింగ్ కోసమో… తనపై ఉన్న ఆరోపణల విషయంలో విచారణలో ఏదో ఆశించారేమో కానీ.. బీజేపీని మెప్పించేలా.. ముస్లిం వర్గంపై విమర్శలు చేశారు.
మన్నెం నాగేశ్వరరావు. తెలుగు అధికారే. కానీ ఒడిషా క్యాడర్. కొద్ది రోజుల క్రితం.. సీబీఐలోని ఇద్దరు ఉన్నత అధికారుల మధ్య జరిగిన గొడవ కారణంగా… చెలరేగిన వివాదంలో ఆయన కొంత కాలం సీబీఐ డైరక్టర్ అయ్యారు. ఆ సందర్భంగా ఆయన చేసిన పనులకు.., సుప్రీంకోర్టు.. రోజంతా.. కోర్టు హాల్లో ఓ మూలన నిల్చో పెట్టింది అది వేరే విషయం. అలాగే.. ఆయనపై.. ఆయన భార్యపై అనేక అవినీతి అరోపణలు.. కొన్ని కేసులు కూడా ఉన్నాయి. అది కూడా వేరే విషయం. తర్వాత కూడా ఆయన పనితీరు తేడాగా ఉండటంతో.. ఆయనను కేంద్రం ఓ ప్రాథాన్యపోస్టుకు పంపేసింది. నిన్న రిటైరయ్యారు.
ఇలా రిటైరయ్యే రెండు రోజుల ముందు సోషల్ మీడియాలో.. మత పరమైన కామెంట్లు పెట్టారు. కేంద్రం కొత్త విద్యా విధానాన్ని ప్రకటించిన సందర్భంగా.. సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టారు. ముస్లింలకు అనుకూలంగా భారత చరిత్రను వక్రీకరించారని భారత నాగరికతను కుట్ర ప్రకారం అబ్రహమైజేషన్ చేశారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతటితో వదిలి పెట్టలేదు…హిందువులను అన్ని రకాలుగా అణచివేశారని.. వామపక్ష అనుకూల విద్యావేత్తలను నెత్తిన పెట్టుకుని, హిందూ అనుకూల జాతీయవాద పండితులను పట్టించుకోలేదన్నారు. 1947-77 మధ్య 30 ఏళ్లలో దేశానికి విద్యాశాఖ మంత్రులుగా 20 ఏళ్లు ముస్లింలు, మిగతా పదేళ్లు వామపక్షవాదులు ఉన్నారని.. హిందువుల పతనానికి ఇది మొదటి దశగా తేల్చారు. విద్యతో పాటు మీడియా, వినోద రంగాలను ఇస్లామీకరణ చేశారని.. హిందువుల ఉనికి ముప్పు వాటిల్లేలా కుట్రలు చేశారని చెప్పుకొచ్చారు.
ఓ సివిల్ సర్వీస్ అధికారిగా ఉండి మన్నెం నాగేశ్వరరావు..ఇలాంటి వ్యాఖ్యలను చేయడం.. స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్, ముస్లిం సమాజానికి చెందిన ఇతర ప్రముఖ విద్యావేత్తలను అవమానించడం క్షమించ రాని నేరమని.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు ఉల్లఘించి బహిరంగంగా రాజకీయ ప్రేరేపిత ప్రకటనలు చేసిన ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి పలువురు రిటైర్డ్ అధికారులు ఫిర్యాదు చేశారు. నిజానికి అది బీజేపీ భావజాలం. ఆయనేమీ గతంలో హిందూత్వ అతివాది కాదు. ఆయన బీజేపీ పాయింట్‌ని క్యాచ్ చేసినట్లేనంటున్నారు. ఎందుకంటే.. బీజేపీ విధానమే… తమ భావజాలం ఉన్న వారిని ప్రతోత్సహించడం మరి..!