ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సలహాదారుగా మారారు. అయితే ఆ సలహాల్లో చాలా వరకూ అందరికీ అర్థం కాకుండా.. చెప్పాల్సిన విధంగానే చెప్పారు. పరోక్షంగా కేసీఆర్ పై ఎలాంటి ప్రతీకార చర్యలు వద్దని రాజకీయంగానే తేల్చుకోవాలని సలహా ఇచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని తక్కువ స్థానాలకు పరిమితం చేయగలిగితే మిగిలిన పని బీజేపీ పూర్తి చేస్తుందని రేవంత్ చేతికి మట్టి అంటదన్నట్లుగా ఆయన సలహా ఇచ్చారు. అంతే కానీ దుందుడుకుగా తనను వేధించినందున వారిని వేధించాలని తొందరపడవద్దని చెప్పారు.అంతే కాదు.. అసలు రేవంత్ రెడ్డిలో కసి పెంచి ఆయనను ఉన్న త స్థానానికి తీసుకు వచ్చింది కేసీఆరే కాబట్టి… ఈ విషయంలో ఆయనకు రేవంత్ రెడ్డి కృతజ్ఞత కూడా చూపాలన్నారు.
ఆర్కే చెప్పిన విషయంలో లాజిక్ ఉంది. రేవంత్ రెడ్డిని కేసీఆరే పెంచారు. ఆయన ఈగో వల్ల కావొచ్చు.. రేవంత్ రెడ్డిని తొక్కేయాలన్న ఆత్రంతో కావొచ్చు కానీ.. ఎలాంటి ప్రతీకార చర్యలు తీసకుంటే రేవంత్ రెడ్డి పెరుగుతాడో కేసీఆర్ అలాంటివే తీసుకున్నారు. అవన్నీ రేవంత్ రెడ్డికి ప్లస్ అయ్యాయి. చివరికి కేసీఆర్ సీటుకే ఎసరు పెట్టి సీఎం అయ్యారు. అందుకే ఇప్పుడు అందరూ కేసీఆర్ ప్రతీకారం తీర్చుకుంటారని అంటున్నారు. ఆ ప్రతీకారం రాజకీయంగానే ఉండాలని వ్యక్తిగతంగా కాదని ార్కే ఈ వారం కామెంట్ ద్వారా రేవంత్ కు సలహా ఇచ్చారని అనుకోవచ్చు.
ప్రతీకార చర్యలు అనేవి ఖచ్చితంగా ఎదుటి వారిక మేలు చేస్తాయి.. రాజకీయాల్లో ఇది ప్రాధమిక సూత్రం. ముందుగా మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. వాటిలో మెజార్టీ స్థానాలు గెల్చుకునేలా చేయడం… గ్రేటర్ లో బలపడటమే రేవంత్ ెడ్డి లక్ష్యమని.. వాటిపైనే రేవంత్ దృష్టి కేంద్రీకరించాలని ఆర్కే సలహా ఇచ్చారు. అదే సమయంలో బీఆర్ఎస్ జోలికి వెళ్లవద్దని ఆయన చెప్పడం లేదు… రాజకీయంగా ఎంత చేయాలో అంతా చేయమని అంటున్నారు. రేవంత్ రెడ్డికి ప్రస్తుతం బొటాబొటి మెజార్టీనే ఉంది. పైగా ఓ పది మంది వరకూ ఆయనను సీఎంగా వ్యతిరేకించేవారు… గతంలోకేసీఆర్ దగ్గర ఎన్నికల ఫండ్ తీసుకున్న వారూ ఉన్నారుని.. ఇవన్నీ బేరీజు వేసుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని చేర్చుకోవాలని సలహా ఇచ్చారు. అాలా చేర్చుకున్నా ప్రశ్నించే అర్హతను కేసీఆర్ కోల్పోయారని కూడా తేల్చేశారు. రెండుసార్లు ఎల్పీలను విలీనం చేసుకున్నకేసీఆర్కు ప్రశ్నించే అర్హత ఉండదని ఆర్కే వాదన.
మొత్తంగా కేసీఆర్ పై వ్యక్తిగతం ఎలాంటి ప్రతీకారం వద్దని.. రాజకీయంగానే తేల్చుకోవాలని… ఆర్కే రేవంత్ రెడ్డికి ఈ వారం కొత్త పలుకు ద్వారా సందేశం పంపారు. ఇంకా ఆయనకు సుదీర్ఘమైన రాజకీయ భవిష్యత్ ఉందని చెప్పారు. ఇంకా ఇరవై ఏళ్ల పాటు రాజకీయం గలిగిన సత్తా ఉందని తొందరపడవద్దన్నారు. ఇప్పటికైతే రేవంత్ సరైన ట్రాక్ లోనే ఉన్నాడని ఆర్కే చెప్పుకొచ్చారు.