సందీప్ కిషన్ ప్రతిభకి కొరత లేదు. సినిమాపై మంచి అవగాహన, పరిజ్ఞానం వుంది. చాలా కష్టపడతాడు. సినిమాపై చాలా నమ్మకంగా ఉంటాడు. ప్రెస్ మీట్లో కూడా చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడతాడు. ‘మైఖేల్’ ప్రెస్ మీట్ లో కూడా అంతే కాన్ఫిడెన్స్ తో కనిపించాడు. ఈ సినిమా ఆడకపోయే అవకాశమే లేదు. ఇలాంటి సినిమా ఆడకపోతే మరెలాంటి సినిమా ఆడుతుంది’’ అన్నాడు. తీరా చూస్తే ‘మైఖేల్’ తీవ్రంగా నిరాశ పరిచింది.
అయితే ఈ ఫలితంలో అన్ని రకాలుగా సందీప్ కిషన్ దే భాద్యత. మైఖేల్ లాంటి కథ కావాలనుకొని ఒక ఐడియాని ముందే అనుకోని దర్శకుడిని పట్టుకున్నాడు. ప్రొడక్షన్ కూడా సెట్ చేసుకున్నాడు. ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణులు అన్నీ సందీప్ ఛాయిసే. అయినా సరే ఫ్లాప్ వచ్చింది. సందీప్ కిషన్ సినిమాలకి బడ్జెట్, తారాగణం, మంచి నిర్మాణ విలువలు అన్నీ ఉంటున్నాయి. కానీ సినిమాలు తేడా కొడుతున్నాయి. మరి ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయో సందీప్ తెలుసుకోవాలి.