మిక్కీ జే మేయర్ అంటే మెలోడీనే గుర్తుకువస్తుంది. హ్యాపీ డేస్, కొత్తబంగారులోకం, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్.. ఇలా బిగినింగ్ డేస్ లో చేసిన సినిమాలు ఆయనకి మెలోడీని ముద్రని తెచ్చిపెట్టాయి. మిక్కీ మేయర్ లో చాలా సూపర్ హిట్లు వున్నాయి. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలు చేశారు. ఆయనలో మంచి మాస్ కూడా వుంది. వైరల్ ట్యూన్లు హిట్లు చేయగల నేర్పు వున్న కంపోజర్ తను. గద్దలకొండ గణేష్ లో జర్రాజర్రా పాట మాస్ ని ఊపేసింది. ఇప్పుడు మళ్ళీ హరీష్ శంకర్ మిక్కీ కాంబినేషన్ లో వస్తున్న మిస్టర్ బచ్చన్ నుంచి వచ్చిన రెండు పాటలు ఆడియన్స్ ని విశేషంగా అలరించాయి.
ముఖ్యంగా రెప్పల్ డప్పుల్ పాటని బీ, సి సెంటర్ల ఆడియన్స్ ని అలరించే ట్యూన్ చేయడం మిక్కీలో మాస్ పల్స్ కి అద్దం పట్టింది. మిక్కీ మ్యూజిక్ పై మంచి కమాండ్ వున్న కంపోజర్. మాస్ కి నచ్చే ట్యూన్స్ కూడా ఇవ్వగలడు. అయితే కెరీర్ లో చాలా లిమిటెడ్ డైరెక్టర్స్ తోనే ఆయన ట్రావెల్ అయ్యాడు. శేఖర్ కమ్ముల, శ్రీకాంత్ అడ్డాల తమ సెన్సిబిలిటీకి తగ్గటు మ్యూజిక్ చేయించుకున్నారు. ఇప్పుడు హరీష్ శంకర్ తనకు కావాల్సిన మాస్ టచ్ మిక్కీ నుంచి తీసుకున్నాడు. భవిష్యత్ లో కూడా మాస్ డైరెక్టర్లుకు క్యాటర్ చేయగల స్టఫ్ మిక్కీలో వుందని మిస్టర్ బచ్చన్ ఆల్బమ్ రుజువుజేస్తోంది.