మిస్టర్ బచ్చన్ రిజల్ట్ ఎలా వున్నప్పటికీ పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మిక్కీ జే మేయర్ తనలో మాస్ కూడా ఉంటుందని నిరూపించుకున్నాడు. సినిమా కంటే మిక్కీ మ్యూజిక్ గురించి ఆడియన్స్ బాగా మాట్లాడుకుంటారు. ఎప్పుడూ అమెరికాలోనే వుండే మిక్కీ.. బచ్చన్ పాటల విశేషాలు పంచుకోవడానికి ఇక్కడ మీడియాని పలకరించాను. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తిరకమైన సంగతి చెప్పారు.
హరీష్ శంకర్ మంచి మ్యూజిక్ సెన్స్ వున్న డైరెక్టర్ అని, మ్యూజిక్ సెన్స్ వున్న డైరెక్టర్స్ తో పని చేయడం ఈజీగా ఉంటుదని అన్నారు. మరి మ్యూజిక్ సెన్స్ లేని డైరెక్టర్స్ తో పని చేయడం ఎలా వుంటుదని అడిగితే.. తన కెరీర్ లో ఎదురుకున్న ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.
‘నేను చేసిన ఓ మూవీ చాలా బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. ఆ డైరెక్టర్ కి ఏం కావాలో తనకి క్లారిటీ వుండేది కాదు. ఏది చేసిన బాలేదని చెప్పేవారు. ఒక దశలో నాకు మ్యూజిక్ రాదేమో అనే డిప్రషన్ లోకి వెళ్ళిపోయాను. మ్యూజిక్ వదిలేసి ఐటీలో జాయిన్ అయిపోవాలని భావించాను. అంతలా టార్చర్ వుండేది. ఒప్పుకున్న ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే ఉద్దేశంతో అతి కష్టంమీద ఆ సినిమాని పూర్తి చేశాను. అలాంటి మ్యూజిక్ సెన్స్ లేని డైరెక్టర్స్ పని చేయడం ఓ నరకం’ అని గతాన్ని గుర్తు చేసుకున్నారు మిక్కీ.
కాకపోతే డైరెక్టర్ పేరుని ప్రస్థావించడానికి ఇష్టపడలేదు మిక్కీ. అయితే మిక్కీ మ్యూజిక్ చేసిన సినిమాలు చూసుకుంటే.. ఆ డైరెక్టర్ పేరు తెలుసుకోవడం పెద్ద పజిల్ ఏమీ కాదు.