హిట్ ట్రాక్ రికార్డు దెబ్బతిని, కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా వున్నాడు హీరో రాజ్ తరుణ్. అయితే ఇప్పుడు ఓ మాంచి ప్రాజెక్టు చేతిలోకి వచ్చింది. దిల్ రాజు నిర్మాత. కృష్ణారెడ్డి దర్శకుడు. ఈ సినిమాకు మాంచి ప్యాడింగ్ ఇచ్చే ప్రయత్నంలో వున్నారు నిర్మాత దిల్ రాజు. సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్ ను తీసుకున్నారు. ఈ మేరకు మిక్కీ అప్పుడే మూడు ట్యూన్ లు కూడా ఇచ్చేసినట్లు తెలుస్తోంది.
మిక్కీ మంచి సంగీత దర్శకుడు. అనేక పెద్ద సినిమాలకు మాంచి క్లాసీ ట్యూన్ లు అందించాడు. అయినా మనవాళ్లు ఎవరెవరినో ట్రయ్ చేస్తుంటారు కానీ, పక్కనున్న మిక్కీని ఎందుకో తీసుకోరు. ఇప్పుడు దిల్ రాజే మరోచాన్స్ ఇచ్చారు.
ఈ సినిమా మార్చి నుంచి పట్టాలెక్కుతుంది. ప్రస్తుతం హీరోయిన్ వేట సాగుతోంది. రాజ్ తరుణ్ పక్కన ఎవరు సూటవుతారు? ఎవరు ఓకె అంటారు అన్నది పెద్ద సమస్య. అదే ఇప్పుడు నడుస్తోంది. లవ్ ఎంటర్ టైన్ మెంట్ జోనర్ లో సాగే ఈ సినిమాను చిన్న బడ్జెట్ తో చకచకా ఫినిష్ చేసి, పోస్ట్ సమ్మర్ గ్యాప్ లో వదలాలని చూస్తున్నారు నిర్మాత దిల్ రాజు.