మంత్రి అమర్నాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి నియోజకవర్గం నుంచి భరత్ కుమార్ అనే మరో నేతను ఇంచార్జిగా ప్రకటించారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. అమర్నాథ్కు మరో నియోజకవర్గం కేటాయించలేదు. కేటాయిస్తారా లేదా అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అనకాపల్లిలో పరిస్థితి బాగోలేదని అమర్నాథ్ కు చాలా కాలంగా తెలుసు. ప్రభుత్వంపై.. తనపై వ్యతిరేకత పెరిగిపోయిందని గెలవడం కష్టమని తేలడంతో ఆయన చోడవరం, యలమంచిలి వంటి నియోజకవర్గాలపై ఆశలు పెట్టుకున్నారు
అయితే … ఆయన స్థానానికి వేరే అభ్యర్థిని ఇంచార్జుగా ప్రకటించారు కానీ అమర్నాథ్ కు ఎక్కడ చాన్సిస్తారో మాత్రం హింట్ ఇవ్వలేదు. దీంతో అమర్నాథ్ పరిస్థితి నియోజకవర్గం లేని నాయకుడు అయ్యారు. హైకమాండ్ చెప్పకుండా చోడవరం, యలమంచిలిల్లో వేలు పెట్టలేరు. ఎందుకంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిని మారుస్తారని ప్రచారం చేస్తున్నారు కానీ.. ఎప్పుడు అన్నదానిపై స్పష్టత లేదు.అసలు మారుస్తారా లేదా అన్నదానిపైనా క్లారిటీ లేదు. అందుకే.. అమర్నాథ్ పరిస్థితి గాలిలో దీపంలా మారింది.
కొసమెరుపేమిటంటే… అమర్నాథ్ టిక్కెట్ల కసరత్తు ప్రారంభమైనప్పటి నుండి.. టిక్కెట్ రాని వాళ్లు వెళ్లిపోవాలనుకుంటే వెళ్లిపోవాలని నేతలకు చెబుతున్నారు. పార్టీ తరపున పని చేసిన వారిని కించపరుస్తున్నారు. తనకు టిక్కెట్ ఇవ్వకపోయినా పర్వాలేదనే ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పుడు నిజంగా ఆయనకు టిక్కెట్ నిరాకరిస్తే… తెలుస్తుందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.