ఏపీలో ఉద్యోగుల బదిలీలపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగకుండా బదిలీల ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని స్పష్టం చేశారు.
బదిలీల కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదన్న అచ్చెన్నా..ఎవరైనా డబ్బులు ఇచ్చినట్లు తేలితే వారి బదిలీలను తానే అడ్డుకుంటానని హెచ్చరించారు.
ప్రజా ప్రతినిధుల పేర్లు చెప్పి బదిలీల కోసం డబ్బులు వసూలు చేస్తే సీరియస్ యాక్షన్స్ ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఈ ప్రక్రియ అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా జరుగుతుందన్నారు.
ప్రస్తుతం ఏపీకి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని.. వీటన్నింటికి వైసీపీ విధానాలే కారణమని విమర్శించారు.గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని వైసీపీ నేతలు చిన్నాభిన్నం చేశారన్నారు.
ఆర్థిక సమస్యలు ఉన్నా.. ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేసి తీరుతుందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.